‘వంగవీటి’పై కేసును కొట్టేసిన హైకోర్టు!

‘వంగవీటి’పై కేసును కొట్టేసిన హైకోర్టు!

Published on Dec 2, 2016 6:16 PM IST

vangaveeti
రామ్ గోపాల్ వర్మ అంటే ఇండియన్ సినిమాలో క్రైమ్ డ్రామా జానర్‌కు బ్రాండ్ డైరెక్టర్. ఈ జానర్‌లో ఆయన చూపిన కొత్తదనాన్ని వేరొక దర్శకులెవ్వరూ చూపలేదన్న పేరుంది. తాజాగా ఆయన వంగవీటి రంగ జీవిత కథ ఆధారంగా ‘వంగవీటి’ అనే క్రైమ్ సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమా కొద్దిరోజులుగా వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. తన తండ్రి రంగ జీవితాన్ని తప్పుడుగా చిత్రించారంటూ వర్మపై రంగ తనయుడు రాధా పిటిషన్ కూడా వేశారు.

ఇక నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉభయ రాష్ట్రాల హైకోర్టు, కేసును కొట్టివేసింది. వర్మ టీమ్ కాపు-కమ్మ అనే పాటను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో, కోర్టు ఈ కేసును పక్కనపెట్టేసింది. డిసెంబర్ 3న విజయవాడలో పెద్ద ఎత్తున ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకుంటోన్న ఈ సినిమాను వర్మ తనస్టైల్లో, డిఫరెంట్ మేకింగ్‌తో తెరకెక్కించారట. ఎవ్వరు బెదిరించినా, సినిమాను అనుకున్నట్లుగానే విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు