ఛార్మి ప్లాన్ కొంత వర్కవుట్ అయింది !
Published on Jul 25, 2017 5:34 pm IST


డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న సెలబ్రిటీల విచారణ సరిగా సాగడంలేదని, బలవంతంగా శాంపిల్స్ సేకరిస్తున్నారని విచారణ జాబితాలో ఒకరైన ఛార్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సమయంలో తమతో పాటు తమ అడ్వకేట్ ను తీసుకెళ్లే సౌకర్యం కూడా ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు మహిళా అధికారుల సమక్షంలో విచారణ జరపాలని, అంతేగాక ఛార్మిని ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే విచారించాలని తెలిపింది.

ఒకవేళ విచారణకు ఎక్కువ సమయం కావాలంటే మరుసటి రోజు చేయవచ్చని, వారి అనుమతి లేకుండా రక్తం, వెంట్రుకల, చేతి గోళ్ల నమూనాలను సేకరించరాదని కూడా సూచించింది. ఇక ఛార్మి తరపు న్యాయవాది విష్ణు వర్ధన్ ఇలా విచారణ జరిపితే ఛార్మి వివాహానికి ఇబ్బంది అం కనుక ఆమెను విచారణను నుండి తొలగించాలని కోరాగా హైకోర్టు అందుకు నిరాకరించింది. సిట్ అధికారులు కూడా కోర్టు సూచనలు మేర విచారణ చేస్తామని, ఇంతవరకు చేసిన విచారణ కూడా నిబంధనల ప్రకారమే చేశామని చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఛార్మి కొంత మేర అనుకున్న డిమాండ్లను సాదించినట్టైంది.

 
Like us on Facebook