చరణ్ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు !

చరణ్ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు !

Published on Feb 17, 2018 9:15 PM IST


యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కొత్త చిత్రం ఈరోజే రెగ్యులర్ షూట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్లో ఉంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు.

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో నటించేందుకు ఒబెరాయ్ దగ్గర దగ్గర రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్నా రెండవ షెడ్యూల్లోనే చరణ్, వివేక్ ల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరిస్తారట. దేవిశ్రీ సంగీతం అందించనున్న ఈ సినిమాలో స్నేహ, తమిళ నటుడు ప్రశాంత్ లు పలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు