మూడోసారి బన్ని – త్రివిక్రమ్ ల కాంబినేషన్?

మూడోసారి బన్ని – త్రివిక్రమ్ ల కాంబినేషన్?

Published on Feb 8, 2016 6:04 PM IST

allu-arjun-and-trivikram1
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా ఒక హిట్ కాంబినేషన్ లో సినిమా అంటే అందరికీ అంచనాలు డబుల్ అవుతాయి.. అదే రెండు సూపర్ హిట్స్ తర్వాత మూడోసారి ఒకటవుతున్నారు అంటే ఇక ఆ సినిమాకి ఏ రేంజ్ అంచనాలు ఉంటాయనేది మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఓ కాంబినేషన్ కి తెరలేవనుంది. వాళ్ళిద్దరే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా బన్నిని 40 కోట్ల క్లబ్ లో చేరిస్తే, ఆ తర్వాత వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమా కూడా 50 కోట్ల మార్క్ ని టచ్ చేసింది.

ఇప్పడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాకి తెరలేవనుంది. అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సరైనోడు’ సినిమాతో బిజీగా ఉంటే, త్రివిక్రమ్ ‘అ..ఆ’సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రిల్ లో రిలీజ్ అవుతాయి. ఆ సినిమాల తర్వాత వీరిద్దరికీ వేరు వేరు కమిట్ మెంట్స్ ఉన్నప్పటికీ, అవి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోందట. అందుకే వీరిద్దరూ ఈ గ్యాప్లో ఓ సినిమా చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నారట. మరీ న్నీ అనుకుంటున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాదే ఓ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు