శవాన్ని కనిపెట్టడంలో విశ్వక్ లాజిక్ ఏమిటీ?

శవాన్ని కనిపెట్టడంలో విశ్వక్ లాజిక్ ఏమిటీ?

Published on Feb 25, 2020 2:01 PM IST

సినిమా ప్రమోషన్స్ లో అనేక కొత్త ట్రెండ్స్ వచ్చి చేరాయి. ట్రైలర్, టీజర్, ఫస్ట్ గ్లిమ్ప్స్, ఫస్ట్ ఇంపాక్ట్, వీడియో ప్రోమో ఇలా అనేక పద్ధతులు పరిచయం అయ్యాయి. అలాంటి ప్రొమోషన్స్ లో భాగమే స్నీక్ పీక్ వీడియో. సినిమాలో కీలక సన్నివేశాన్ని ముందుగానే ప్రేక్షకులకు పరిచయం చేసి, తరువాత ఏమి జరిగివుంటుంది అనే ఆసక్తి కలిగేలా చేయడం దీని ఉద్దేశం. చాలా సినిమాలు ఈ పద్ధతి ఫాలో అవుతున్నాయి . ఇక విశ్వక్ సేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ స్నీక్ పీక్ వీడియో నేడు విడుదల చేశారు.

కిడ్నాప్ అయిన ఓ అమ్మాయి శవాన్ని కనుగొనే క్రమంలో హీరో విశ్వక్ ఉపయోగించిన లాజిక్ ఏమిటీ? అనే అనుమానం, ఆసక్తి కలిగేలా ఈ వీడియో వుంది. హిట్ మూవీ శైలేష్ కొలను తెరకెక్కించగా హీరో నాని నిర్మించారు. రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. ఈనెల 28న విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు