నితిన్ సినిమాలో హాలీవుడ్ నటుడు !
Published on Apr 19, 2017 3:51 pm IST


గతేడాది ‘అ..ఆ’ చిత్రం భారీ విజయాన్నందుకుని కెరీర్లోనే భారీ వసూళ్లను రాబట్టుకున్న నితిన్ ఈ ఏడాది చేస్తున్న చిత్రం ‘లై’. లవ్.. ఇంటెలిజెన్స్.. ఎనిమిటి అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ గత నెలలో విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ లో నితిన్ ఇదివరకటిలా కాకుండా పూర్తిగా లుక్ మార్చి సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈరోజు ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి పుట్టినరోజు సందర్బంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయడమే కాకుండా సినిమా గురించిన ఒక కొత్త విశేషాన్ని కూడా బయటపెట్టారు నితిన్.

ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఒకరు నటిస్తున్నారు. అతనే డాన్ బిల్జీరియాన్. ఇతను ‘ఒలంపస్ హస్ ఫాలెన్, లోన్ సర్వైవర్, వార్ డాగ్స్, ది అథర్ ఉమెన్’ వంటి చిత్రాల్లో నటించడమే కాక ఇన్స్టాగ్రమ్ వంటి సోషల్ మీడియాలో కూడా బాగా పేరున్న వ్యక్తి. సినిమా చాలా వరకు అమెరికా నైపథ్యంలోనే జరుగుతుంది కనుక అక్కడి స్థానిక పాత్రలు కథలో ఉంటాయని, అందుకే డాన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. నితిన్ ఇతన్ని స్వయంగా పరిచయం చేస్తూ డాన్ మీరు చాలా నేచ్యురల్ గా ఉంటారు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ఇకపోతే నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook