ధరమ్ తేజ్ సినిమాలో హాలీవుడ్ సినిమా ఛాయలు ?

ధరమ్ తేజ్ సినిమాలో హాలీవుడ్ సినిమా ఛాయలు ?

Published on Jan 19, 2018 12:07 PM IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ సినిమాల దర్శకుడిగా పేరున్న కరుణాకరన్ ఈ ఈ సినిమాని కూడా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండేలా చూస్తున్నారట. అనేట్టుగా ఈ చిత్రంలో హాలీవుడ్ రొమాంటిక్ చిత్రం ‘ది వోవ్’ తాలూకు ఛాయలు కనిపిస్తాయని వినికిడి.

అనగా స్టోరీ లైన్ కాకుండా ఆ చిత్రంలో జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాల ఫార్మాట్లోనే ఇందులో కూడా కొన్ని సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. కె.ఎస్.రామారావ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ‘ఇంటెలిజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు