చిరంజీవి కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ !

చిరంజీవి కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ !

Published on Aug 23, 2017 5:00 PM IST


మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ నిన్న ఘనంగా లాంచ్ అయిన సంగతి తెల్సిందే. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార వంటి స్టార్ నటీ నటులను ప్రాజెక్టులోకి తీసుకున్న మెగా టీమ్ సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక నాణ్యత విషయంలో కూడా సినిమా గొప్ప స్థాయిలో ఉండాలని బెస్ట్ క్రూను ఎంచుకున్నారు మెగాస్టార్.

ఇప్పటికే సంగీతం కోసం ఏఆర్ రెహమాన్ ను ఎంచుకోగా సినిమాటోగ్రఫీ కోసం రవి వర్మన్, ప్రొడక్షన్ డిజైనర్ గా రాజీవన్ ను తీసుకున్నారు. ఇక స్వాతంత్ర్య పోరాట నైపథ్యంలో నడిచే సినిమా కనుక యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ టోనీ చింగ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈయన గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ‘స్పైడర్ మ్యాన్’ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు