విష్ణు ‘డైనమైట్’లో హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్

విష్ణు ‘డైనమైట్’లో హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్

Published on Aug 28, 2015 8:26 AM IST

Dynamite
ఒకేరకమైన సినిమాలను కాకుండా ప్రతి సినిమాలోనూ ఓ డిఫరెంట్ కథని, తన పాత్రలో వైవిధాన్ని చూపడానికి ఇష్టపడే మంచు విష్ణు ట్రే చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. హై రేంజ్ ఇంటెన్స్ ఉన్న సినిమాలు తీసిన దేవకట్టా ఈ సినిమాకి దర్శకుడు. మంచు విష్ణు సరసన అందాల భామ ప ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కోసం మంచు విష్ణు స్పెషల్ గా తన బాడీని టోన్ చేసుకోవడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని ఇది వరకే తెలియజేశాము.

ఈ సినిమాలో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ పై మంచు విష్ణు స్పందిస్తూ ‘డైనమైట్ లో కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే 47 రోజులు కేటాయించాను. ఇద్దరు స్పెషల్ ట్రైనర్స్ ని పెట్టుకొని బాడీ ని తోన్ చేయడమే కాకుండా సినిమా కోసం 7కిలోల బరువు పెరిగాను. హాలీవుడ్ చిత్రాలలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా కష్టపడతారు. అవి చాలా బాగుంటాయి. ఆ రేంజ్ లో కాకపోయిన హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ మనమూ ట్రై చేయచ్చని ఇందులో ట్రై చేసాను. విజయన్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఒళ్ళు జలదరించేలా ఉంటాయని’ విష్ణు తెలిపాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే సెన్సార్ కి వెళ్లనున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్ బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు