‘నా పేరు సూర్య’కి పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ !

‘నా పేరు సూర్య’కి పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ !

Published on Apr 19, 2018 3:22 AM IST


అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ అన్ని పనుల్ని పూర్తిచేసుకుని ఈ నెల 22న ఆడియో వేడుకకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలన్నిటికీ మంచి స్పందన కూడ దక్కగా యూఎస్లో చిత్రీకరించిన ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ అనే పాటను హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జోసెఫ్ లబిసి చిత్రీకరించినట్టు తెలిసింది.

జోసెఫ్ లబిసి ‘ది మూవీ హీరో, ది రిపేర్’ వంటి సినిమాలతో పాటు పలువురు పాపులర్ పాప్ గాయకుల మ్యూజిక్ వీడియోలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఇకపోతే ఈ పాటలో అను ఇమ్మాన్యుయేల్, బన్నీలకు కాస్ట్యూమ్స్ కూడ పాపులర్ హాలీవుడ్ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఆన్ మేరీ హూంగ్ డిజైన్ చేశారట. ఈమె గతంలో జెన్నిఫర్ లోఫెజ్, నిక్కీ మినాజ్ వంటి పాప్ సింగర్స్ తో కలిసి పనిచేశారు.

శిరీష శ్రీధర్, బన్నీ వాసులు సంయుక్త నిర్మాణంలో వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మే 4వ తేదీన విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు