మహేష్ సినిమాను ఎలా కాదంటాం? : శృతి హాసన్

మహేష్ సినిమాను ఎలా కాదంటాం? : శృతి హాసన్

Published on Aug 1, 2015 11:41 AM IST

mahesh-and-shrutihaan
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను ఇప్పటికే వేగవంతం చేశారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఊపందుకున్న ప్రచారం, తాజాగా సాంప్రదాయ మీడియా, పత్రికా ఇంటర్వ్యూలతో మరింత జోరుగా జరుగుతోంది. ఇక నిన్న ఉదయం నుంచే హీరోయిన్ శృతి హాసన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో భాగమైపోయారు. పత్రికా ఇంటర్వ్యూలు, వీడియో ఇంటర్వ్యూలతో శృతి హాసన్ బిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్‌‌తో కలిసి నటించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం ఆ అవకాశాన్ని వదిలేసుకుంటారు?” అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు శృతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు