ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్స్ అలియా,ఒలీవియా నేనా …?

ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్స్ అలియా,ఒలీవియా నేనా …?

Published on Nov 22, 2019 10:52 AM IST

రాజమౌళి తెరకెక్కించే ఆర్ఆర్ఆర్ గురించిన ప్రతి విషయం ఆసక్తికరమే. బాహుబలి లాంటి భారీ విజయం తరువాత తీస్తున్న మరో భారీ చిత్రం కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ కావడం మరో విశేషం. ఇక రెండు రోజుల క్రితం ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బ్రిటిష్ యాక్ట్రెస్ ఒలీవియా మోరిస్ మరియు విలన్స్ గా చేస్తున్న రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి లను పరిచయడం చేయడం జరిగింది.

ఇక చరణ్ కి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అలియా భట్ నటిస్తుండగా వీరిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకణ కూడా జరిగింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 70% పూర్తయిందని చిత్ర యూనిట్ ప్రకటించిన తరుణంలో ఒలీవియా, అలియా భట్ లు మాత్రమే ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్స్ అని తెలుస్తుంది. అనగా ఈ చిత్రంలో ఇంక చరణ్ కి గాని, తారక్ కు గాని మరో హీరోయిన్ ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. గతంలో ఎన్టీఆర్ కు ఒక బ్రిటిష్ హీరోయిన్ తోపాటు లోకల్ హీరోయిన్ ఒకరు ఉంటారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అవి పుకారుగా మిగిలిపోనున్నాయి. ఇప్పటికి ఇంకా ఆర్ ఆర్ ఆర్ సాంగ్స్ చిత్రీకరణ జరగకుండానే మూడొంతుల షూటింగ్ పూర్తయితే మరో హీరోయిన్ ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు