సమంతని ప్రియాంక చోప్రా ఎలా ఎడ్పించింది.?

సమంతని ప్రియాంక చోప్రా ఎలా ఎడ్పించింది.?

Published on Jul 24, 2014 4:36 PM IST

samantha-priyaka

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన ‘మేరీ కొమ్’ ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ప్రియాంక చోప్రాని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే ఈ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇదే ట్రైలర్ ని సౌత్ ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా చూసి కంటతడి పెట్టుకుంది. ‘ఇప్పుడే ‘మేరీ కొమ్’ ట్రైలర్ చూస్తూ ఎయిర్ పోర్ట్ లో పబ్లిక్ ముందు కంటతడి పెట్టాను. కన్నీళ్ళు ఎందుకు వచ్చాయా అన్నది తెలియడం లేదు. నేను వివరించలేకపోతున్నాను కానీ సూపర్బ్ ఫీలింగ్’ అని సమంత ట్వీట్ చేసింది.

ఒలంపిక్ బాక్సింగ్ చాంపియన్ మేరీ కొమ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని ఓముంగ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. సంజయ్ లీలా భన్సాలి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు