సూర్యుడే.. మా సినిమాలో విలన్ : హీరో నిఖిల్

సూర్యుడే.. మా సినిమాలో విలన్ : హీరో నిఖిల్

Published on Mar 4, 2015 9:04 PM IST

nikhil
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి రెండు వరుస సూపర్ హిట్లతో జోరు మీదున్న యువహీరో నిఖిల్.. అదే ఉత్సాహంతో ‘సూర్య vs సూర్య’ అనే సినిమాతో ఒక సరికొత్త కథాంశం ద్వారా మన ముందుకు రానున్నాడు. సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా, మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర విశేషాలను తెలియజేశారు నిఖిల్.

సూర్య vs సూర్య ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో నడిచే రొమాంటిక్ కామెడీ అని, ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఈ సినిమాలో ఉందని అన్నారు. ఈ సినిమాలో విలన్ సూర్యుడేనని ఆయన అన్నారు. సూర్యుడి ఎండ తగిలితే తట్టుకోలేని పార్ఫిరియా అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడే హీరో.. ఈవ్యాధిని ఎలా ఎదిరించాడన్నదే సినిమా కథ అని ఆయన పేర్కొన్నారు. అందరూ అనుకుంటున్నట్టు ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాదనీ, ఒక అందమైన ప్రేమకథే ఈ చిత్రమని తెలిపారు. తన సినిమాల్ని తాను ఎప్పుడూ ముందే చూడలేదని, థియేటర్లో వచ్చాకే తానూ చూస్తానని చెప్పారు. ‘నిఖిల్ సినిమా అంటే కచ్చితంగా ఎంటర్‌టైన్‌‌మెంట్ ఉంటుంది’ అనే విశ్వాసం తనపై కలిగేలా కొత్తగా సినిమాల్ని తీస్తానని చెప్పారు.

బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్‌తో సెన్సార్ వద్ద పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా ఫలితం రేపటికి తెలిసిపోనుంది. మరి ఈ సినిమాతో నిఖిల్ హ్యాట్రిక్ కొడతాడా ?.. వేచి చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు