కార్తికేయ హిందీ హక్కుల కోసం భారీ డిమాండ్

కార్తికేయ హిందీ హక్కుల కోసం భారీ డిమాండ్

Published on Jan 27, 2015 12:09 AM IST

karthikeya
నిఖిల్ స్వాతీ నటించిన ‘కార్తికేయ’ సినిమా గత సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయం సాధించింది. లాజిక్, హ్యుమర్, సస్పెన్స్ సమపాళ్ళలో మేళవించి ఈ చిత్ర బృందం ప్రేక్షకాదరణ పొందారు. నిర్మాతలకు, పంపిణీదారులకు ఈ చిత్రం మంచి లాభాలని అందించింది. ఈ సినిమా స్టామినాని తెలుసుకున్న బాలీవుడ్ సంస్థలు ఈ సినిమా రిమేక్ హక్కులను పొందడానికి ఉవ్విళ్ళురతుంది.

తాజా సమాచారం ప్రకారం ఏక్తా కపూర్, అతుల్ అగ్నిహోత్రి లు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఎంత చెల్లించేందుకన్నా వెనకాడడం లేదు. అయితే ఈ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ ఏ మాత్రం కంగారుపడకుండా ఇంకొన్ని రోజులాగి మంచి ధరకు అమ్మాలని చూస్తున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు