నాని సినిమాకు భారీ స్థాయి ప్రీమియర్లు !

నాని సినిమాకు భారీ స్థాయి ప్రీమియర్లు !

Published on Jun 29, 2017 5:16 PM IST


సక్సెస్ ఫుల్ యంగ్ హీరో నాని చేసిన ‘నిన్ను కోరి’ సినిమా అన్ని పనుల్ని పూర్తి చేసుకుని జూలై 7న రిలీజుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా నాని సినిమాలంటే ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుంది. పైగా రెండు హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆయన చేసిన సినిమా కావడంతో ‘నిన్ను కోరి’ విషయంలో ఆ క్రేజ్ ఇంకాస్త ఎక్కువ మోతాదులోనే ఉంది. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నాని ఇంతకు ముందు సినిమాలకన్నా దీనికి ఎక్కువ సంఖ్యలో ప్రీమియర్లు వేయాలని నిర్ణయించారట.

6వ తేదీ రాత్రి సుమారు 500 వరకు షోలు పడేలా ప్లాన్ చేశారని వినికిడి. ఈ వార్త ప్రకారం అన్ని షోలు గనులకు పడినట్లైతే ‘నిన్ను కోరి’ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మంచి ఆదరణ పొందడం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం కానుంది. ఇకపోతే నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్ హీరోయిన్ కాగా ఆది పినిశెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు