వర్మ సినిమాకు షాక్ ఇచ్చిన వీరప్పన్ భార్య!

వర్మ సినిమాకు షాక్ ఇచ్చిన వీరప్పన్ భార్య!

Published on Nov 27, 2015 9:30 AM IST

killing-veerappan
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కిల్లింగ్ వీరప్పన్ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

ఇక ట్రైలర్, పోస్టర్స్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. కాగా సినిమా రిలీజ్‌కు సరిగ్గా వారం ఉందనగా, కిల్లింగ్ వీరప్పన్ టీమ్‌కు ఓ పెద్ద షాక్ తగిలింది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సినిమా విడుదలకు దగ్గరైన సమయంలో సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ హిందీలో మాత్రమే ఈ సినిమా చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇన్ని భాషల్లో తీశారని, తమ భాషలోనూ సినిమా విడుదలవుతున్నందున తమ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు పూర్తి సినిమా చూయించాలని ముత్తులక్ష్మి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరి ఈ డిమాండ్‌పై వర్మ టీం ఎలా స్పందిస్తుందే వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు