నైజాంలో మొదటిరోజు సూపర్ కలెక్షన్లు సాధించిన ‘హైపర్’

నైజాంలో మొదటిరోజు సూపర్ కలెక్షన్లు సాధించిన ‘హైపర్’

Published on Oct 1, 2016 10:30 AM IST

hyper-ram
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘నేను శైలజా’ వంటి విజయం తరువాత చేసిన చిత్రం ‘హైపర్’. ముందు నుండే పాటలు, ట్రైలర్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నిన్న విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు సూపర్ కలెక్షన్లను సాధించింది. ఒక్క నైజాం ఏరియాలోనే రూ. 1. 51 కోట్లు కొల్లగొట్టింది. రామ్ కెరీర్లో ఇవే ఉత్తమమైన కలెక్షన్లగా నమోదయ్యాయి. కథ కాస్త పాతదే అయినప్పటికీ దానికి కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ హంగులు అద్ది సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధం, తండ్రి మీద అతి ప్రేమ చూపించే కొడుకు అనే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఘిబ్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే సత్య రాజ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రలు పోషించారు. మరో వారం వరకూ వేరే పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో ఈ కలెక్షన్లు మరింత ఊపందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు