‘హైపర్’ రన్‌టైమ్ ఎంతంటే..!

‘హైపర్’ రన్‌టైమ్ ఎంతంటే..!

Published on Sep 28, 2016 7:25 PM IST

hyper-ram-press
రామ్ హీరోగా నటించిన ‘హైపర్’ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 30న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం టీమ్ చేపడుతోన్న ప్రచార కార్యక్రమాలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకు తండ్రి-కొడుకుల మధ్యన నడిచే ఓ ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన బలంగా నిలుస్తాయని చెబుతూ వస్తోన్న నిర్మాతలు, నెరేషన్ కూడా కమర్షియల్ సినిమా స్టైల్లో స్పీడ్‌గా ఉంటుందని, రన్‌టైమ్ 2 గంటల 23 నిమిషాలని తెలిపారు.

రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. తండ్రి అంటే విపరీతమైన ఇష్టం ఉండే ఓ ఆసక్తికర పాత్రలో రామ్ ఇందులో కనిపించనున్నారు. ‘నేను శైలజ’ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తోన్న ఈ సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందని రామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు