ఇంటర్వ్యూ : పూజ జావేరి – తెలుగు ఇండస్ట్రీ చాలా సౌకర్యంగా ఉంది !

ఇంటర్వ్యూ : పూజ జావేరి – తెలుగు ఇండస్ట్రీ చాలా సౌకర్యంగా ఉంది !

Published on Nov 8, 2016 1:46 PM IST

pooja-jhaveri
‘భమ్ భోలేనాథ్’ చిత్రంతో తెలుగుప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ‘పూజ జావేరి’. దాదాపు 20 వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఈమె తెలుగు, తమిళ భాషల్లో 5 చిత్రాల్లో నటించి ఇప్పుడు ‘ద్వారక’ చిత్రం ద్వారా మరోసారి మన ముందుకొస్తోంది. ఈ సందర్బంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) మీ గురించి కాస్త చెప్తారా ?

జ) నేను గుజరాత్ లో పుట్టాను. ముంబైలోనే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. సినిమాల్లోకి రాకముందు రిం, నేచర్ పవర్ సోప్ వంటి 20 కమర్షియల్ యాడ్స్ లో నటించాను. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను.

ప్ర) కమర్షియల్ యాడ్స్ కు ముందు ఏదైనా జాబ్ చేసేవారా ?

జ) నేను చదువుకుంది గ్రాఫిక్ డిజైనింగ్. అందులో పనిచేశాను. తరువాత బాలీవుడ్ సినిమాలకి కొరియోగ్రఫీ కూడా చేశాను.

ప్ర) ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో నటించారు ?

జ) ఇప్పటి వరకూ తెలుగులో ‘భం భోలేనాథ్, రైట్ రైట్, ఎల్7’ సినిమాల్లో నటించాను. ఈ ద్వారక నాకు తెలుగులో నాలుగవ సినిమా. అలాగే తమిళంలో ధనుష్ తో ‘తోడారి’ చేశాను. మరో సినిమాలో కూడా నటిస్తున్నాను.

ప్ర) ఈ ద్వారక సినిమా ఎలా ఉండబోతోంది ?

జ) ఒక చెడ్డవాడు స్వామీజీగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా అంతా ద్వారక బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. మంచి ఎంటర్టైనర్.

ప్ర)సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?

జ) సినిమాలో నా పాత్ర టఫ్ గా ఉంటుంది. కానీ చాలా త్వరగా ప్రేమలో పడిపోతుంది. మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఇది నాకు మరిన్ని అవకాశాలొచ్చేలా చేస్తుందని అనుకుంటున్నాను.

ప్ర) విజయ్ తో పనిచేయడం ఎలా ఉంది ?

జ) విజయ్ దేవరకొండ మంచి నటుడు. ‘పెళ్లి చూపులు’ హిట్ కాకముందే ఈ సినిమాకి సైన్ చేశాడు. అతనితో వర్క్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నాకు అతను మంచి ఫ్రెండ్.

ప్ర) బాలీవుడ్ పనిచేశారు కదా.. అక్కడ ఆఫర్లేమీ రాలేదా ?

జ) బాలీవుడ్ లో ఆఫర్లొస్తున్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. అందరూ మంచి వాళ్ళు. ఇక్కడే సెటిలైపోవాలని ఉంది.

ప్ర) ఇందులో మీది గ్లామర్ పాత్ర లేక నటనకు ప్రాధాన్యమున్న పాత్ర ?

జ) నా పాత్రలో గ్లామర్ ఉంది, నటన కూడా ఉంది. సినిమాలో ఎక్కువగా హాఫ్ శారీలో హోంమ్లీగానే కనిపిస్తాను.

ప్ర) ఫ్యూచర్ లో మీకు ఎలాంటి పాత్రలు చేయాలనుంది ?

జ) పర్టిక్యులర్ గా ఇలాంటి పాత్రలే చేయాలనే ఉద్దేశ్యం లేదు . నాకు నచ్చే పాత్రలు వస్తే అవి ఏవైనా సరే చేస్తాను. కానీ ఎక్కువగా మైథలాజికల్, హిస్టారికల్ సినిమాల్లో నటించాలని కోరిక.

ప్ర) కొత్త సినిమాలేవన్నా సైన్ చేశారా

జ) ఇంకా ఏ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. చాలా ఆఫర్లకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఏది ముందుగా నచ్చితే దానికి సైన్ చేస్తా.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు