కేసు విషయంలో తనకెలాంటి భయం లేదన్న కమల్ !


స్టార్ హీరో కమల్ హాసన్ చేస్తున్న తమిల్ బిగ్ బాస్ షో వలన తమిళ సంస్కృతికి అవమానం జరుగుతుందంటూ తమిళనాడుకు చెందిన హిందూ మక్కల్ కట్చచి పోలీస్ కేసు పెట్టి షో నిలిపివేసి కమల్ ను నిర్వాహకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిన్న సాయంత్రం కమల్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు.

పేస్ మీట్లో మాట్లాడిన కమల్ ‘ నాకు అన్ని వర్గాల ప్రేక్షకులు ముఖ్యమే. బిగ్ బాస్ షో మీద కానీ నా మీద కానీ పెట్టిన కేసు విషయంలో నాకెలాంటి భయం లేదు. ఎందుకంటే మన న్యాయవ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. నాపై కేసు పెట్టినవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నిజాన్ని చూపించడం సంస్కృతిని నాశనం చేయడం ఎలా అవుతుంది. బిగ్ బాస్ షో 11 సంవత్సరాల నుండి బాలీవుడ్లో నడుస్తొంది. అప్పుడు పెట్టని కేసులు ఇప్పుడెందుకు పెడుతున్నారు. దేశానికి క్రికెట్ ఎంత అవసరమో బిగ్ బాస్ కూడా అంతే అవసరం’ అంటూ తనదైన శైలిలో స్పందించారు.

 

Like us on Facebook