ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘కేరాఫ్ సూర్య’ విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను !

ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ‘కేరాఫ్ సూర్య’ విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను !

Published on Nov 9, 2017 5:28 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘కేరాఫ్ సూర్య’ రేపే తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) టైటిల్ లో కేరాఫ్ అని పెట్టడానికి కారణం ?
జ) సాధారణంగా మనం చిన్నప్పుడు మన కేరాఫ్ అంటే అమ్మ, నాన్న, బంధువులు వస్తారు. కానీ పెద్దయ్యాక మన కేరాఫ్ అంటే ఫ్రెండ్. ఈ సినిమా స్నేహం అనే కోణంలో నడిచే ఎమోషనల్ డ్రామా. ఇందులో సూర్య నేను. నేను ఎవరెవరికి కేరాఫ్ అడ్రెస్ అవ్వాల్సి ఉంటుంది అనేదే కథ.

ప్ర) మా పాత్ర ఎలా ఉంటుంది ?
జ) చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన పాత్ర చేశాను. అంటే పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. ‘నా పేరు శివ’ సినిమాలో కార్తి పాత్రకు కొనసాగింపుగా ఉన్నట్లు ఉంటుంది.

ప్ర) మీ దర్శకుడు సుశీంద్రన్ గురించి చెప్పండి ?
జ) సుశీంద్రన్ చేసిన మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఒక వ్యక్తిగా అయన చాలా మంచివాడు. ఆయన సినిమాల్లో నిజాయితీ ఉంటుంది. ప్రతి సినిమా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.

ప్ర) తెలుగు, తమిళ వెర్షన్లకు తేడా ఏంటి ?
జ) తెలుగుకి, తమిళానికి తేడా కొద్దిగా ఉంటుందని. ఫస్టాఫ్ పూర్తిగా తేడా ఉంటుంది. మళ్ళీ సెకండాఫ్ ఒకలానే ఉంటుంది. తెలుగులో వైల్డ్ నెస్ కొంచెం తగ్గించాం. తెలుగు వెర్షన్లో లవ్ ట్రాక్ ఎక్కువుంటుంది.

ప్ర) ఈ సినిమాని రెండు భాషల్లో ఎందుకు చేశారు ?
జ) తెలుగులో చేస్తే రూ. 7 కోట్లు, తమిళంలో చేస్తే రూ.7 కోట్లు. అదే రెండింటిలో కలిపి చేస్తే రూ. 10 కోట్లు ఖర్చయ్యింది. అంటే ఇద్దరు నిర్మాతలకు చెరో రెండు కోట్లు మిగిలాయి. పైగా మార్కెట్ మొత్తం ఏకమైపోయింది కాబట్టి రెండు భాషల్లోనూ సినిమాను డీల్ చేయగల దర్శకుడితో పని చేయాలనుకుని చేశా.

ప్ర) మెహ్రీన్ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో ఆమె పాటర్ చాలా ఫన్నీగా ఉంటుంది. కొద్దిగా రౌడీలా బిహేవ్ చేస్తుంది. ఆమె కనిపించిన ప్రతిసారి నవ్వుకుంటారు. ఆమె కూడా చాల బాగా నటించింది.

ప్ర) సుశీంద్రన్ తో వర్క్ ఎలా ఉంది ?
జ) నేను వర్క్ చేసిన బెస్ట్ డైరెక్టర్స్ లో సుశీంద్రన్ ఒకరు. ఆయన కథ, పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. టెక్నికల్ అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టరు. అవి కథతో పాటే వెళ్లిపోతుంటాయి.

ప్ర) సినిమాను ఎవరికైనా చూపించారా ?
జ) తమిళంలో కొందరికి ప్రివ్యూ వేశాం. చూసిన వాళ్లంతా ఖచ్చితంగా సినిమా హిట్టవుతుందని అన్నారు. ఆ హిట్ ఏ స్థాయిలో ఉంటుందో రేపు విడుదలయ్యాక తెలుస్తుంది.

ప్ర) ‘నక్షత్రం’ ఫ్లాపవ్వడం ఎలా అనిపించింది ?
జ) అంటే ఆ సినిమా నాకు బాగా నచ్చి చేసిన చిత్రం. నాకెన్నాళ్ళగానో కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలని ఉండేది. ఆ సినిమా వలన నాకు మంచి పెర్ఫార్మ్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ఆ సినిమా మీద కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను.

ప్ర) ఈ సినిమా విజయం పట్ల పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారా ?
జ) అవును. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఎందుకంటే ఇదొక నిజాయితీ కలిగిన సినిమా. కూర్చున్నంతసేపు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉంటుంది. ‘నా పేరు శివ’ సినిమా ఎవరికైతే నచ్చిందో వాళ్లందరికీ ఈ సినిమా కూడా తప్పక నచ్చుతుంది.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) మంజులగారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే కునాల్ కోహ్లీతో ఒక ప్రాజెక్ట్ ఉంది. అది స్ట్రయిట్ తెలుగు సినిమానే. దాని తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో ఒక ప్రాజెక్ట్ ఉంది. తమిళంలో కార్తీక్ నరేన్ తో ‘నరగసూరన్’ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు