ఇంటర్వ్యూ: వరుణ్ తేజ్ – బన్నీ, చరణ్, తేజ్ ఎవరితో అయినా మల్టీ స్టారర్ చేస్తాను !

ఇంటర్వ్యూ: వరుణ్ తేజ్ – బన్నీ, చరణ్, తేజ్ ఎవరితో అయినా మల్టీ స్టారర్ చేస్తాను !

Published on Apr 11, 2017 2:14 PM IST


‘కంచె’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీవైట్ల డైరెక్షన్లో ‘మిస్టర్’ సినిమాను చేశారు. ఈ ఏప్రిల్ 14న సినిమా రిలీజవుతున్న స్సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) శ్రీనువైట్లతో మీ జర్నీ ఎలా ఉంది ?
జ) శ్రీనువైట్ల, నేను కలిసి సంవత్సరం అవుతోంది. స్టోర్ డిస్కషన్స్ చేసేప్పుడు, షూటింగ్ చెప్పుడు మా జర్నీ చాలా బాగా జరిగింది. గుర్తుపెట్టుకోదగిన విశేషాలు చాలా ఉన్నాయి. ఇదొక ట్రావెలింగ్ సినిమాల కాబట్టి చాలా చోట్ల తిరిగాం. స్పెయిన్, స్విట్జర్ ల్యాండ్, ఊటీ లకు వెళ్లాం. యూనిట్ అంతా ఒక కుటుంబమంలా కలిసి పనిచేశాం. అన్ని సినిమాలకు ఇలా కుదరదు. ఈ సినిమాకి మాత్రమే కుదిరింది.

ప్ర) అసలు ఈ ‘మిస్టర్’ ఏం చేస్తాడు ?
జ) మిస్టర్ అందరికీ ప్రేమ పంచుతూ ఉంటాడు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేస్తాడు. అందరికీ సహాయం చేసే మిస్టర్ ప్రేమకి ప్రాబ్లం వస్తే దాన్ని అతను ఎలా సాల్వ్ చేసుకుంటాడు, తన ప్రేమను ఎలా వెతుక్కుంటాడు అనేదే ఈ సినిమా. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నాకు, ఇద్దరు హీరోయిన్లకి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మా ముగ్గురికీ కలిపి మరొక స్టోరీ ఉంటుంది.

ప్ర) శ్రీనువైట్ల కొత్తగా ట్రై చేశారు. ఎలా అనిపిస్తోంది ?
జ) ఆయనేదో కొత్తగా ట్రై చేయలేదు. మొదట్లో ఆయన చేసింది ఈ తరహా సినిమాలే. కానీ మధ్యలో కమర్షియల్ సినిమాలు చేయడం, అవి సక్సెస్ అవడంతో అందరూ ఆయన్ను అవే అడిగారు. ఆ జర్నీలో ఆయనకు కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. తర్వాత ఆయన రియలైజ్ అయి పాత పద్ధతిలోనే చేయాలని ఈ సినిమా చేశారు. అంతేగాని ఈ సినిమాలు ఆయనకేం కొత్తకాదు. ఆయన్ను నుంచి నేను చాలా నేర్చుకున్నాను.

ప్ర) ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్ ఏ కొత్తదనముంటుంది ?
జ) ఇందులో నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. నా ముందు సినిమాల్లో నేను చేసినవన్నీ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండే పాత్రలు. కానీ ఇందులో మాత్రం రొమాంటిక్ గా కనిపిస్తాను. ఆయన పర్టిక్యులర్ గా అదే కావాలని చేయించారు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఆయన డైలాగ్ టైమింగ్ నాకు కొత్త, కొంచెం ఫాస్టుగా ఉంటాయి. అది కూడా ట్రై చేశాను. నాకైతే బాగానే చేశానని అనిపించింది.

ప్ర) కెరీర్ మొదటి నుండి పెద్ద దర్శకులతోనే పని చేస్తున్నారు. కారణం ?
జ) నాకు చాలా మంది చాలా కథలు చెప్పారు. ఈ సినిమా షూటింగ్లో కూడా గాయపడి రెండు నెలలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా 20 కథలు ఉన్నాను. నెక్స్ట్ కొత్త దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా సినిమా చేస్తున్నాను.

ప్ర) పాత దర్శకులతో పనిచేయడం ఎలా ఉంటుంది ?
జ) శ్రీనువైట్లగారి లాంటి సీనియర్లతో పనిచేయడం చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరిడీ ఒక్కో స్టైల్. పూరిగారి దగ్గరైతే చాలా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. క్రిష్ ది మరొక స్టైల్, శ్రీకాంత్ గారిది ఇంకో రకమైన స్టైల్. ప్రతి ఒక్కరి దగ్గరా ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు.

ప్ర) ఫెయిల్యూర్స్ మీరు చేసే సినిమాల మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా ?
జ) అలాంటిదేం లేదు. ఒక థాట్ లో ఇరుక్కుపోయి సినిమా చేయను. నా మొదటి సినిమా సక్సెస్ కాలేదు, అలాగే మూడో సినిమా కూడా. శ్రీనుగారికి బయట చాలామంది సక్సెస్ ఫుల్ హీరోలు దొరుకుతారు. కానీ ఆ పాత్రకి నేనే కరెక్ట్ అనుకోని నన్ను తీసుకున్నారు. ఫైల్యూర్ కి చేసే సినిమాలకి ఎలాంటి సంబంధం ఉండదు.

ప్ర) మీ నాన్నగారితో సినిమా ఎప్పుడు చేస్తారు ?
జ) నేను కూడా చేయాలనే అనుకుంటున్నాను. కొంతమంది కథలు కుడా చెప్పారు. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను.

ప) ‘ఫిదా’ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ?
జ) ఈ సినిమాతో పాటే ఆ సినిమా కూడా చేస్తూ వచ్చాను. ఇంకో 20 – 25 రోజుల షూటింగ్ ఉంది. రెండిటినీ ఒకేసారి కంప్లీట్ చేస్తే రిలీజ్ డేట్స్ క్లాష్ అవుతాయని కాస్త స్లోగా చేస్తున్నాను. ఒక ఖచ్చితమైన రిలీజ్ డేట్ చూసుకుని చేస్తాం.

ప్ర) ‘ఫిదా’ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) అది కూడా లవ్ స్టోరీనే. కానీ ‘మిస్టర్’ లా ఉండదు. కొంచెం క్లాస్ గా ఉంటుంది. శేఖర్ గారి సినిమాల్లో క్యారెక్టర్స్ తక్కువగా ఉంటాయి. ఇందులో కామెడీ కూడా పెద్దగా ఉండదు. అంతా హీరో మీదే నడుస్తుంది. ఆయన ‘ఆనంద్, గోదావరి’ తర్వాత హీరో ఓరియెంటెడ్ రోల్స్ చేయడం ఇదే.

ప్ర) గీతా ఆర్ట్స్ లో సినిమా అంటున్నారు ఏంటి ?
జ) అవును అనుకున్నాం. కానీ ఇంకా సరైన కథ దొరకలేదు. ఈ మధ్య బన్నీ పుట్టినరోజు నాన్న వెళ్ళినప్పుడు కూడా అరవింద్ గారు చేద్దామన్నారు. కథ దొరికితే తప్పకుండా చేస్తాం. చరణ్, తేజ్, బన్నీ ఎవరితో అయినా సరే మంచి కథ దొరికితే చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు