ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఇమ్మడి ప్రవీణ్ – సునీల్ కుమార్ రెడ్డిగారితో వర్క్ చేయడం చాలా బాగుంది !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఇమ్మడి ప్రవీణ్ – సునీల్ కుమార్ రెడ్డిగారితో వర్క్ చేయడం చాలా బాగుంది !

Published on Mar 15, 2017 4:28 PM IST


ప‌వ‌న్‌, కారుణ్య‌ చౌదరి జంటగా న‌టించిన సినిమా `ఏటీఎం వ‌ర్కింగ్‌’. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘గంగపుత్రులు’ వంటి మంచి సందేశాత్మక చిత్రంతో అందరి ప్రసంశలు అందుకున్న పి.సునీల్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చేయగా ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించారు. మార్చి 17న చిత్ర రిలీజ్ సందర్బంగా సంగీత దర్శకుడు ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర)మీ సినీ కెరీర్ ఎలా ప్రారంభమైంది ?

జ) నేను మొదట కీ బోర్డు ప్లేయర్ ని. వందేమాతరం శ్రీనివాస్, రాజ్ – కోటి వంటి పెద్ద పెడా మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పని చేశాను. సుమారు 400 సినిమాలకు వరకు చేశాను. ప్రస్తుతం ఈ చిత్రానికి సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాను.

ప్ర) సోలోగా ఇంతకుముందు ఎన్ని చిత్రాలు చేశారు ?
జ) సోలోగా ఇంతకూ ముందు ‘గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమకథ’ లాంటి సినిమాలకు వర్క్ చేశాను.

ప్ర) అన్ని సినిమాలు సునీల్ కుమార్ రెడ్డిగారితోనే చేశారు. అది ఎలా కుదిరింది?
జ) నాకు మొదట అవకాశం ఇచ్చింది సునీల్ కుమార్ రెడ్డి గారే. ఆయనకు నాకు మంచి రాపో ఉంటుంది. ఆయనకు ఏం కావాలో నేను ఈజీగా అర్థం చేసుకోగలను. ఆయన కూడా నాతో చాలా సౌకర్యంగా ఉంటారు. అందుకే అన్ని సినిమాలకు కలిసి పని చేశాం.

ప్ర) ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంటుంది ?
జ) సునీల్ కుమార్ రెడ్డిగారితో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. ఆయనకు ఒక మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. ఒకవేళ మనం చేసింది నచ్చకపోతే అలా మార్చు ఇలా మార్చు అనే చేంజెస్ ఉండవు మొత్తం రీప్లేస్ చేయడమే. అందుకే నేను ఆయన సీన్ చెప్పినప్పుడు నాలుగైదు వెర్షన్లు తయారు చేసి పెట్టుకుంటాను.

ప్ర) ఈ సినిమాల్లో సంగీతం ఎలా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా ప్రస్తుతం నడుస్తున్న ఒక హాట్ టాపిక్ ను తీసుకుని దానిపై కాస్త హాస్యాస్పదంగా తీసిన సినిమా. ఆ హాస్యానికి తగ్గట్టే ఇందులో మ్యూజిక్ ఉంటుంది.

ప్ర) ఇందులో ఎన్ని పాటలున్నాయి ?
జ) ఇందులో మొత్తం 3 పాటలున్నాయి. ఒకటి లవ్ సాంగ్, ఒకటో రొమాంటిక్ సాంగ్ మరొకటి థీమ్ సాంగ్. థీమ్ సాంగ్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం అందరూ ఎదుర్కుంటున్న సమస్యలను ఇందులో ప్రస్తావించడం జరిగింది.

ప్ర) ఈ చిత్రం మీకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారు ?
జ) ఈ సినిమా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. మ్యూజికల్ గా మంచి హిట్ అవుతుంది. ఈ విజయంతో నాకు మంచి మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను.

ప్ర ) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) తర్వాత కూడా సునీల్ రెడ్డిగారి కాంబినేషన్లోనే ‘గల్ఫ్’ అనే సినిమా చేస్తున్నాను. అది కూడా మంచి చిత్రం. అందులో ఒక పాట పూర్తిగా అరబిక్ లో ఉంటుంది. గల్ఫ్ లో ఉండే వాళ్ళ చేత పాట రాయించి పాడించాం. తెలుగులో మొదటి అరబిక్ పాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు