సంక్రాంతి కానుకగా రానున్న శంకర్ ‘ఐ’

సంక్రాంతి కానుకగా రానున్న శంకర్ ‘ఐ’

Published on Nov 23, 2014 9:52 AM IST

i-poster1
ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ శంకర్ తన్న కెరీర్లో మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన ర ఓజు నుంచి అందరూ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. చాలా రోజులుగా సస్పెన్స్ గా ఉన్న రిలీజ్ డేట్ పియా ఈ చిత్ర టీం క్లారిటీ ఇచ్చింది.

2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. అనుకున్న దానికంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోవడం వలన ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. విజువల్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.

విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కూడా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు