ఇంటర్వ్యూ : శ్రియ శరన్ – సినిమాలో నాది చాలా అందమైన పాత్ర

ఇంటర్వ్యూ : శ్రియ శరన్ – సినిమాలో నాది చాలా అందమైన పాత్ర

Published on Jan 29, 2018 12:30 PM IST

సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియ శరన్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నేను ఒక చిన్న పల్లెటూరికి చెందిన అమ్మాయిలా కనిపిస్తాను. నా క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ గా, నిజాయితీగా, తెలివిగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాను ఒప్పుకోడానికి ప్రధాన కారణం ?
జ) డైరెక్టర్ మదన్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర కూడా సహజంగా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

ప్ర) సినిమా షూటింగ్లో మీ అనుభవాలు ?
జ) షూటింగ్ చేసినన్ని రోజులు చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా మీద ఒక అందమైన పాట కూడా ఉంది. ముఖ్యంగా నా కాస్ట్యూమ్ డిజైనర్ డిజైన్ చేసిన డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి.

ప్ర) డైరెక్టర్ మదన్ వర్క్ ఎలా ఉంది ?
జ) దర్శకుడు మదన్ చాలా కూల్ గా ఉంటారు. ఎక్కడా ఇబ్బందిపడలేదు. ప్రతి ఒక్కరినీ కంఫర్ట్ గా ఉంచుతారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా బాగుంది.

ప్ర) మీరు ఇంత లాంగ్ కెరీర్ కొనసాగించడం వెనుక సీక్రెట్ ?
జ) అంటే దర్శకులు, రచయితలు మంచి కథలు, పాత్రలు రాస్తున్నారు కాబట్టి నా కెరీర్ చాలా బాగుంది. అలాగే నేను చూజ్ చేసుకునే సినిమాలు కూడా నాకు బాగా కలిసొచ్చాయి. అంతేగాక నేను లక్కీ కూడ.

ప్ర) మీ తర్వాతి సినిమాలు ఏంటి ?
జ) తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’ చేస్తున్నాను. తమిళంలో కార్తీక్ నరేన్ తో ‘నరగసూరన్’ చేస్తున్నాను. తర్వాత ‘శాతకర్ణి’ సినిమా కెమెరామెన్ నిర్మాతగా మారి సినిమా చేస్తున్నారు. అందులో కూడా నరిస్తున్నాను. ఆ చిత్రాన్ని ఒక లేడీ డైరెక్టరు డైరెక్ట్ చేయనుంది.

ప్ర) ఇలా యువ దర్శకులతో వరుస సినిమాలు చేయడానికి కారణం ?
జ) వాళ్ళు రాసే కథలే ప్రధాన కారణం. వసంతరాయలు సినిమాకు ఆ దర్శకుడు రాసిన కథ చాలా బాగుంటుంది. అలాగే కార్తిక్ నరేన్ రాసిన కథ కూడా చాలా బ్యూటిఫుల్ స్టోరీ. అంత బాగా రాశారు కాబట్టే నేను చేయడానికి ఒప్పుకున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు