అవార్డ్స్ ని లెక్కచేయనన్న స్టార్ హీరోయిన్ !

tamanna-67

తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్లలో నటి తమన్నా కూడా ఒకరు. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘కత్తి సందై’. ఈ చిత్రం తెలుగులో సైతం ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో విడుదలకానుంది. దీంతో తమన్నా కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన ఓ మీడియా ఇంటర్వ్యూలో అవార్డుల పట్ల మీ అభిప్రాయమేమిటి అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నేను అసలు ఆవార్డ్స్ ను లెక్కచేయను అన్నారు.

అలాగే అవార్డ్స్ కోసం కాకుండా సినిమా హిట్ అవ్వాలని నటిస్తానని అలా కాకుండా సినిమా ప్లాప్ అయి నటించిన నాకు అవార్డ్స్ వస్తే ఎలాంటి కిక్ ఉండదని అన్నారు. అలాగని తను చేసే రోల్స్ లో కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా నటనకు కూడా ఆస్కారముండేలా చూసుకుంటానని తెలిపారు. ఇకపోతే తమన్నా ఈ సినిమాతో పాటు తమిళంలో ఒక సినిమా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి – 2 లో నటిస్తోంది.

 

Like us on Facebook