ఇంటర్వ్యూ : సప్తగిరి – రొటీన్ కామెడీ రోల్స్ బోర్ కొట్టి.. హీరో అవుతున్నాను !

ఇంటర్వ్యూ : సప్తగిరి – రొటీన్ కామెడీ రోల్స్ బోర్ కొట్టి.. హీరో అవుతున్నాను !

Published on Dec 22, 2016 6:50 PM IST

sapthagiri
డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అనుకోకుండా నటనలోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు సప్తగిరి ఇంకో అడుగు ముందుకేస్తూ హీరోగా చేసిన సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రేపు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సప్తగిరి, చిత్ర నిర్మాత డా.రవి కిరణ్ మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సప్తగిరి గారు మీరు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు హీరో అవ్వాలని అనుకున్నారా ?

జ) లేదండీ.. నేను డైరెక్టర్ అవ్వాలని పరిశ్రమలోకి వచ్చాను. కానీ అనుకోకుండా బొమ్మరిల్లు భాస్కరుగారు నన్ను నటుడ్ని చేశారు. ప్రేమ కథా చిత్రం నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. దాంతో స్టార్ కమెడియన్ అయ్యాను. ఇప్పుడు హీరోగా ఛాన్స్ వచ్చింది. ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తున్నాను.

ప్ర) కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్నారు కదా హీరో అవ్వాలని ఎందుకనిపించింది ?

జ) అందరూ అదే అన్నారు. కానీ నేను చాలా రోజుల్నుంచి ఒకే తరహా పాత్రలు, నటన చేస్తున్నాను. అది నాకే బోర్ కొట్టింది. సెంటిమెంట్, డ్యాన్స్ అన్నీ నేను కూడా చేసి మెప్పించగలననిపించింది. అందుకే హీరోగా చేస్తున్నాను.

ప్ర) రవి కిరణ్ గారు సినిమాకు ఏ ధైర్యంతో చాలా పెద్ద మొత్తం ఖర్చు పెట్టారు ?

జ) నేను సినిమా మొదలుపెట్టేటప్పుడు ఇది నా సినిమా గొప్పగా ఉండాలిని, డా.రవి కిరణ్ సినిమాలంటే గొప్పగానే ఉంటాయి అని అందరూ అనుకోవాలని ఖర్చు పెట్టాను. డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదు.

ప్ర) సినిమా మొత్తాన్ని వేరే డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వకుండా మీరే రిలీజ్ చేయడానికి కారణం ?

జ) అంటే.. ఇది నా మొదటి సినిమా. పైగా ప్రయోగం. ఏదైనా తేడా జరిగి డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం నాకిష్టం లేదు. అందుకే నష్టమైనా లాభమైనా నేనే భరించాలని అనుకున్నాను. అందుకే మొత్తం నేనే రిలీజ్ చేస్తున్నాను.

ప్ర) మరి సినిమా షూట్ 80 % అయ్యాక టైటిల్ పవన్ గారికి ఇవ్వడం వలన సమస్యలేమీ రాలేదా ?

జ) సమస్యలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ అంతటి వారు అడిగాక ఇవ్వకుండా ఎలా ఉంటాం. అయనకు ఫేవర్ చేసే ఛాన్స్ రావడమే గొప్ప విషయం. పైగా ఆయనంటే మా అందరికీ మంచి అభిమానం ఉంది. అందుకే ఇచ్చాం.

ప్ర) సప్తగిరిగారు ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

జ) ఇందులో నాది సినిమాల్లో నటుడవ్వాలని ట్రై చేసే క్యారెక్టర్. మా నాన్న కానిస్టేబుల్, నన్ను ఐఏఎస్ అవమంటాడు. కానీ నేను సినిమాల్లోకే వెళతానని పోరాడుతుంటాను.

ప్ర) సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ?

జ) ఇందులో ఇంట్రడక్షన్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సీన్లో నేను ఏడు గెటప్స్ లో కనిపిస్తాను. సీన్ చాలా బాగా వచ్చింది. సినిమా మొత్తానికి అదే హైలెట్.

ప్ర) ఇకపై మీరు కమెడియన్ గా సినిమాలు చేయరా ?

జ) అదేం లేదు. కమెడియన్ గా చేస్తాను. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా, శర్వానంద్ సినిమా చేస్తున్నాను.

ప్ర) తమిళ్ ఒరిజినల్ వెర్షన్ కి దీనికి ఎమన్నా తేడా ఉందా ?

జ) ఒరిజినల్ వెర్షన్ నుండి కేవలం 8 నిముషాల ముఖ్యమైన కంటెంట్ మాత్రమే తీసుకున్నాం. మిగతా అంతా సొంతంగానే తయారు చేశాం. ఒరిజినల్ వెర్షన్ కన్నా ఇందులో 90% ఇంఫ్రూమెంట్ ఉంటుంది.

ప్ర) భవిష్యత్తులో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఎమన్నా ఉందా ?

జ) ఖచ్చితంగా చేస్తాను. నేను పరిశ్రమలోకి వచ్చిందే డైరెక్టర్ అవుదామని. మధ్యలో ఇలా హీరో అయ్యాను. ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు