మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడని గర్వంగా ఫీల్ అవుతా – దేవి శ్రీ ప్రసాద్

మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడని గర్వంగా ఫీల్ అవుతా – దేవి శ్రీ ప్రసాద్

Published on Sep 22, 2014 12:36 PM IST

Mandolin-Srinivas-and-DSP
హిట్ సినిమాల సంగీత దర్శకుడు అని పిలిపించుకోవడం కంటే ‘మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడు ప్రసాద్’ అని పిలిపించుకోవడంలోనే నాకు కిక్ ఉంది. మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడని గర్వంగా ఫీల్ అవుతాను అని యువ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. 9 ఏళ్ల వయసు నుండి సుమారు 10 సంవత్సరాల పటు దేవి శ్రీ ప్రసాద్.. మాండలిన్ శ్రీనివాస్ గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నన్ను ఒక శిష్యుడిలా కాకుండా సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఆయన మరణం ఒక పీడకల అయితే బాగుండేది అని దేవి శ్రీ ప్రసాద్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

నేను ఎక్కువగా వెస్ట్రన్ మూడ్‌లో పాటలను కంపోజ్ చేసినా… మెలొడీని మాత్రం మిస్ చేయను. అది నా గురువుగారు పెట్టిన బిక్ష అని దేవి చెప్పారు. మాండలిన్ శ్రీనివాస్ అంటే మాండలిన్ వాయిద్యకారుడని చాలామంది భావిస్తారు. ప్రపంచంలో చాలా దేశాలు గురువు గారిని ‘ఆనరబుల్ సిటిజన్’గా గుర్తించాయి. ఆయన సాధించిన విజయాలు(ఎచీవ్‌మెంట్స్) అంతగా ప్రాచూర్యంలోకి రాలేదు. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఒక శిష్యుడిగా నాపై ఉంది. త్వరలోనే ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను. అని దేవి శ్రీ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు