ఇంటర్వ్యూ:మెహ్రీన్ కౌర్ – తెలుగు సినిమాలు చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను !

ఇంటర్వ్యూ:మెహ్రీన్ కౌర్ – తెలుగు సినిమాలు చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను !

Published on Nov 26, 2017 4:20 PM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి మెహ్రీన్ కౌర్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘జవాన్’ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ?
జ ) ఇందులో నా పాత్ర పేర భార్గవి. పెయింటర్. తనకేం కావాలో తనకు బాగా తెలుసు. బబ్లీగా ఉంటుంది.

ప్ర) మీ మిగతా సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటి ?
జ) ఇంతకూ ముందు సినిమాల్లో నేను చాలా నార్మల్ గా కనిపించాను. కానీ ఇందులో కొంచెం ఎక్కువ గ్లామర్ గా కనిపిస్తాను. కొంచెం డిఫరెంట్ గా కూడా కనిపిస్తాను.

ప్ర) ధరమ్ తేజ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) చాలా హ్యాపీగా ఉంది. తేజ్ ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉంటాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అతనితో వర్క్ చాలా ఈజీగా ఉంటుంది.

ప్ర) ధరమ్ తేజ్ మంచి డ్యాన్సర్.. అతనితో డ్యాన్స్ ఎలా చేశారు ?
జ) తేజ్ మంచి డ్యాన్సర్. చిన్నప్పటి నుండి నేను డ్యాన్స్ నేర్చుకోలేదు. సినిమాల్లోకి వచ్చాక కూడా నాకు పెద్దగా డ్యాన్స్ రాదు. కానీ ఈ సినిమాలో నాకు మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయ్. ఈ సినిమా కోసం డ్యాన్స్ క్లాసులకి కూడా వెళ్ళాను. ఇకపై వచ్చే నా ప్రతి సినిమాలో డ్యాన్స్ ఉంటుంది.

ప్ర) బివిఎస్ రవికి ఇది రెండవ సినిమానే కదా.. సైన్ చేసే ముందు ఆ విషయం గురించి ఆలోచించారు ?
జ) ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నాకసలు ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తిగా తెలీదు. ఇప్పటికి కూడ. కానీ రవిగారు నా మీద పెట్టుకున్న నమ్మకం వలెనే సైన్ చేశాను. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విడుదలైన 2వ రోజే ఈ సినిమాకి సైన్ చేశాను. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన కోసమే సైన్ చేశాను. ఖచ్చితంగా మూవీ హిట్టవుతుంది.

ప్ర) మీ కెరీర్లో ఇదే బెస్ట్ సినిమా అవుతుందా ?
జ) అలాగని చెప్పను. నేను చేసిన అన్ని సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. ప్రతి సినిమా నాకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. ప్రతిదీ బెస్ట్ సినిమానే.

ప్ర) మీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) రీసెంట్ గా గోపీచంద్ గారి 25వ సినిమాకి సైన్ చేశాను. చక్రి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైతే అదొక్కటే.

ప్ర) బాలీవుడ్లోకి వెళ్లాలనే ఆలోచనలున్నాయా ?
జ) నాకు అలాంటి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు. ప్రాక్ట్స్ కోసం ఇక్కడ సినిమాలు చేసి తర్వాత అక్కడికి వెళ్లిపోవాలని నాకు లేదు. తెలుగు సినిమా నాకు ఎప్పటికీ ఎక్కువే. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలో చేస్తున్నందుకు గర్వంగా చెబుతాను. అయినా నా దృష్టిలో టాలీవుడ్, బాలీవుడ్ వేరు వేరు కాదు. నాకు సినిమానే ముఖ్యం. ప్రస్తుతం తెలుగు సినిమానే టాప్ లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు