ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాఠి – చిరంజీవిగారి పాటను రీమిక్స్ చేయాలి అనగానే టెంక్షన్ పడ్డాను !

ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాఠి – చిరంజీవిగారి పాటను రీమిక్స్ చేయాలి అనగానే టెంక్షన్ పడ్డాను !

Published on Feb 6, 2018 12:52 PM IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటించిన తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్’. టాప్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నా క్యారెక్టర్ పేరు సంధ్య. యూఎస్లో చదువుకుని ఇండియా వచ్చి తండ్రికి బిజినెస్ లో సహాయం చేసే అమ్మాయి క్యారెక్టర్. సినిమాలో నాకు కొంచెం కోపం కూడా ఎక్కువే.

ప్ర) ఈ పాత్రలో మీకు ప్రత్యేకంగా అనిపించిందేంటి ?
జ) అంటే ప్రతి డైరెక్టర్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా వినాయక్ గారి టేకింగ్ భిన్నంగా అనిపించింది. పైగా పాత్రలో నటించే స్కోప్ కూడా ఎక్కువగా కనబడింది. అందుకే ఒప్పుకున్నాను.

ప్ర) సినిమాకు ‘ఇంటిలిజెంట్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ?
జ) అది హీరో వైపు నుండి పెట్టిన టైటిల్. హీరో తన ఇంటెలిజెన్స్ తో విలన్లని ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ.

ప్ర) తేజ్ తో మొదటిసారి వర్క్ చేశారు. ఎలా అనిపించింది ?
జ) నేను వర్క్ చేసిన హీరోలందరిలో ధరమ్ తేజ్ చాలా కంఫర్ట్ అయిన వ్యక్తి. ఎప్పుడూ ఫన్నీగా ఉంటాడు. మంచి నటుడు అన్నిటినీ మించి మంచి డ్యాన్సర్ కూడ.

ప్ర) మీరు కూడా డ్యాన్సులు బాగా చేసినట్టున్నారు ?
జ) అవును. నా అన్ని సినిమాలకన్నా ఈ సినిమాలో ఎక్కువ డ్యాన్సులు చేశాను. వాటి కోసం ప్రాక్టీస్ కూడా బాగానే చేశాను. ఖచ్చితంగా అవి అందరికీ నచ్చుతాయి.

ప్ర) చిరంజీవిగారి ‘చమకు చమకు’ పాటను రీమిక్స్ చేసేప్పుడు టెంక్షన్ అనిపించలేదా ?
జ) ఆ పాట చాలా గొప్ప పాట. అందులో నటించింది లెజెండ్స్. వాళ్ళ స్థాయిలో చేయడం నిజంగా సాధ్యంకాదు. అందుకే ప్రేక్షకులకు నచ్చేలా మా ప్రయత్నం మేం చేశాం. సినిమాలో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నామని చెప్పగానే కొంత టెంక్షన్ పడ్డాను.

ప్ర) వినాయక్ లాంటి టాప్ డైరెక్టర్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) వినాయక్ చాలా సింపుల్ గా ఉంటారు. సినిమాకు ఏం కావాలో ఆయనకు పక్కాగా తెలుసు. కాబట్టి మా చేత సులభంగా పని చేయించుకున్నారు. సెట్స్ లో కూడా నెమ్మదిగా ఉంటారు. మమ్మల్నందరినీ చిన్న పిల్లల్లా చూసుకున్నారు.

ప్ర) ఈ మధ్య మీ వలన నిర్మాతలు కొంతమంది ఇబ్బందిపడ్డట్టు ఆరోణలు వచ్చాయి ?
జ) నేను వర్క్ చేసిన అన్ని నిర్మాణ సంస్థలకి నాకు మధ్యన మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. కానీ తమిళంలో ఒక నిర్మాణ సంస్థతో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయి. అవి కూడా ప్రత్యేకంగా నా వలన కాదు. ఆ విషయం కూడా ప్రూవ్ అయింది.

ప్ర) హీరోయిన్లకి డిఫరెంట్ స్కిప్ట్స్ ఎంచుకునే ఛాన్స్ ఉంటుందా ?
జ) నిజం చెప్పాలంటే హీరోలకున్నంత వీలైతే హీరోయిన్లకు ఉండదు. కానీ మాక్కూడా అలా భిన్నమైన స్క్రిప్ట్స్ చూజ్ చేసుకునే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

ప్ర) మీ నిర్మాత సి. కళ్యాణ్ గారి గురించి చెప్పండి ?
జ) సి.కళ్యాణ్ గారికి సినిమా అంటే చాలా ఫ్యాషన్. అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ఎప్పుడూ సెట్స్ లోనే ఉంటూ షూటింగును ఎంజాయ్ చేసేవారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు