సెన్సార్ పూర్తి చేసుకున్న శంకర్ ‘ఐ’.

సెన్సార్ పూర్తి చేసుకున్న శంకర్ ‘ఐ’.

Published on Dec 18, 2014 5:35 PM IST

I-poster
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఐ’. నేడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ప్రధానం చేసింది. నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తవడంతో దర్శకనిర్మాతలు పబ్లిసిటీపై దృష్టి పెట్టారు.

తమిళంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ భారి బడ్జెట్ సినిమాను తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన తెలుగు ఆడియోను త్వరలో విడుదల చేయనున్నారు.

ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ‘ఐ’ సినిమాకు పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రసంశలు అందుకుంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. తమిళ, తెలుగు, హిందీలతో పాటు పలు విదేశి భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు