రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టం – విశాల్

రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టం – విశాల్

Published on Aug 30, 2014 2:59 PM IST

vishal
యంగ్ హీరో విశాల్ స్వతహాగా తెలుగు వాడైనా ముందు తమిళంలో నటుడిగా సక్సెస్ అయ్యి ఆ తర్వాత ‘పందెం కోడి’, ‘భరణి’, ‘పొగరు’, ‘ఇంద్రుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. కమర్షియల్ గా ఉంటూనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి ఇష్టపడే విశాల్ రిస్క్ చేయడం అంటే చాల ఇష్టం అని అంటున్నాడు.

‘థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకి మనం మన సినిమాలో కొత్తగా ఏమి చూపిస్తున్నాం అన్న పాయింట్ నచ్చితేనే నేను సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. అందుకే రిస్క్ చెయ్యడానికి భయపడను, చెప్పాలంటే రిస్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రేక్షకుల చప్పట్ల కోసం కష్టపడి ఎలాంటి సాహసాలైనా చేయాలని’ అన్నాడు.

ప్రస్తుతం విశాల్ – శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వంలో ‘పూజ’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇది కాకుండా శశికాంత్ దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అలాగే సుందర్ సి డైరెక్షన్ లో మరో తమిళ సినిమా సెట్స్ పై ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు