ఇంటర్వ్యూ : హరనాథ్ పొలిచెర్ల : నాకు సినిమా అంటే వ్యాపారం కాదు.. ఆత్మ సంతృప్తి !

ఇంటర్వ్యూ : హరనాథ్ పొలిచెర్ల : నాకు సినిమా అంటే వ్యాపారం కాదు.. ఆత్మ సంతృప్తి !

Published on May 16, 2017 7:18 PM IST


ఇన్నాళ్లు నటుడిగా, హీరోగా ప్రేక్షకుల్ని మెప్పించిన హరనాథ్ పొలిచెర్ల సువీయ దర్శకత్వంలో హీరోగా చేస్తూ రూపొందించిన చిత్రమే ఈ ‘టిక్ టాక్’. ట్రైలర్లతోనే సినిమాలోని విభిన్నత్వాన్ని పరిచయం చేసిన ఆయన తాజాగా మీడియాతో ఇంకొన్ని విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

ప్ర) అసలు ‘టిక్ టాక్’ అంటే అర్థమేమిటి ?
జ) టైటిల్లో టిక్ అంటే మనిషి బ్రతికున్నప్పటి జీవితం, టాక్ అంటే చనిపోయాక జీవితం అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడు, ఆత్మా అవుతాడు అని పలు రకాలుగా అంటారు. ఆలా మరణం తర్వాత జీవితం ఏమిటనే ఆలోచనతో చేసిన సినిమానే ఇది.

ప్ర) అంటే ఇందులో హర్రర్ కంటెంట్ కూడా ఉంటుందా ?
జ) ఉంటుంది. చనిపోయాక మనిషి జీవితం ఏమిటి అంటే ఆత్మలు కూడా ఉంటాయి కదా.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నేనొక మెకానిక్ లా కనిపిస్తాను. పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్. మంచి ఫన్ కూడా ఉంటుంది. మంచి డ్యాన్సులు కూడా ట్రై చేశాను.

ప్ర) అసలు మీ సినీ కెరీర్ ఎలా మొదలైంది?
జ) నేను అమెరికాలో ఉండేటప్పుడు ఒక కన్నడ సినిమాను మా ఇంట్లోనే షూట్ చేశారు. ఆ దర్శకుడు నాచేత కూడా అందులో ఒక రోల్ చేయించాడు. దాంతో మరో కన్నడ సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా అవకాశమొచ్చింది. ఆ తర్వాతతెలీని భాషల్లో కన్నా తెలిసిన భాషలో కష్టపడటం మేలని అనుకుని తెలుగులోకి వచ్చాను.

ప్ర) ఇన్నేళ్ల మీ కెరీర్లో మీకు బాగ్ పేరు తెచ్చిన సినిమా ఏంటి ?
జ) నాకు బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం ‘చంద్రహాస్’. అప్పటి వరకు సినిమాలంటే వద్దని వారించే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ సినిమా చైన్ చాల బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఈ టిక్ టాక్ సినిమా కూడా అంతటి విజయాన్నిస్తుందని ఆశిస్తున్నాను.

ప్ర) డాక్టర్ గా మీది మంచి కెరీర్. అది వదిలేసి సినిమాల్లోకి ఎందుకొచ్చారు ?
జ) డాక్టర్ గా తీరిక లేకుండా పదేళ్లు కష్టపడ్డాడను. అప్పుడే నాలో జీవితం అంటే ఇంతేనా అనే ప్రశ్న మొదలైంది. దాంతో చిన్నపాటి నుండి ఇష్టమైన సినిమా రంగంలోకి వచ్చేశాను.

ప్ర) మీరు చేసిన సినిమాలకు పెద్దగా రిటర్న్స్ లేవు. దాని మీద మీ అభిప్రాయం ?
జ) నాకు సినిమా అంటే వ్యాపారం కాదు. అప్పట్లోనే ‘చంద్రహాస్’ సినిమానౌ రూ. 5 కోట్లు పెట్టి తీశాను. సినిమాతీస్తే నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అదే అన్నిటికన్నా గొప్పది. దాని కోసమే సినిమాలు చేస్తున్నాను.

ప్ర) కొత్త దర్శకులు మీతో సినిమా చేస్తానంటే అవకాశమిస్తారా ?
జ) తప్పకుండా. మంచి కథతో ఎవరైనా ముందుకొస్తే వారికి తప్పకుండా అవకాశమిస్తాను.

ప్ర) ఈ సినిమా నుండి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు ?
జ) ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులోనే ఎక్కువ ఫన్ ఉంటుంది. సినిమా మొలైన దగ్గర్నుంచి చివరి దాకా థ్రిల్ దొరుకుతుంది.

ప్ర) షూటింగ్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు ?
జ) ఈ సినిమా షూటింగ్ ను 20 రోజుల్లో చేసేశాం. షూటింగ్ ఆఖరు రోజునైతే 24 గంటలు కష్టపడ్డాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు