డీజే కలెక్షన్ల విషయంలో తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వలేదన్న దిల్ రాజు !
Published on Jul 18, 2017 8:55 am IST


అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ వసూళ్ల విషయంలో వార కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెల్సిందే. నిర్మాత దిల్ రాజు ప్రకటిస్తున్నవన్నీ ఫేక్ కలెక్షన్ అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఒకానొక దశలో చిరంజీవి ఫాన్స్ దిల్ రాజును స్వయంగా సంప్రదించి వివరణ అడిగారు కూడా. దీంతో డీజే వసూళ్ల విషయాల్లో ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం నెలకొంది.

దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. డీజే వసూళ్ల విషయంలో తాను ఎలాంటి అబద్దాలు చెప్పలేదన్న ఆయన బన్నీ కెరీర్లో బెస్ట్ సినిమాగా చెప్పుకునే ‘సరైనోడు’ వసూళ్లను డీజే క్రాస్ చేసింది. దీన్నిబట్టి సినిమా హిట్ లేక ఫ్లాపో మీరే చెప్పండి. ఒక నిర్మాతగా నా బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు నేనే బాధ్యుడిని. ఈ సంవత్సరం ఇది నాకు హ్యాట్రిక్ హిట్. నా చిత్రాల కలెక్షన్ల విషయంలో నేను తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఇకపై ఇవ్వను కూడా అని బల్లగుద్ది చెప్పారు.

 
Like us on Facebook