‘ఐ’ తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ డేట్

‘ఐ’ తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ డేట్

Published on Nov 26, 2014 10:50 PM IST

I
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఐ’. తమిళంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ భారి బడ్జెట్ సినిమాను తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆడియోను డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. హిందీ వెర్షన్ ఆడియో డిసెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇటివల విడుదలయిన తమిళ ఆడియో శ్రోతలను అలరిస్తుంది.

తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమానికి ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ హాజరయ్యారు. తెలుగు ఆడియో విడుదలకు ఎవరు వస్తారో..? జాకీ చాన్ హాజరుకావోచ్చని సమాచారం.

ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ‘ఐ’ సినిమాకు పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రసంశలు అందుకుంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు