యుట్యూబ్ లో రికార్డులు సృష్టించిన ‘ఐ’ టీజర్

యుట్యూబ్ లో రికార్డులు సృష్టించిన ‘ఐ’ టీజర్

Published on Sep 16, 2014 3:57 PM IST

i-poster
విడుదలైన 12 గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని యుట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది ‘ఐ’ టీజర్. ఇదొక రికార్డు. సోమవారం ఆడియో విడుదల సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తుంది.

విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఐ’ అని, శంకర్ మాత్రమే ఇటువంటి సినిమాలు తీయగలదని సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు ‘ఐ’ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వన్ మినిట్ ‘ఐ’ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ భారి బడ్జెట్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పిసి శ్రీరామ్, ఏఅర్ రెహమాన్ వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేశారు.

 

‘ఐ’ టీజర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు