అంచనాలను మించిన ‘ఐ’ ట్రైలర్.. సింప్లీ సూపర్బ్.

అంచనాలను మించిన ‘ఐ’ ట్రైలర్.. సింప్లీ సూపర్బ్.

Published on Dec 19, 2014 10:49 AM IST

I-poster
సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమాలకు కొత్త వరవడి నేర్పిన దర్శకుడు శంకర్. ఈ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన తాజా సినిమా ‘ఐ’. ఇప్పటికే ‘ఐ’ సినిమా టీజర్ లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శంకర్, నేడు తమిళ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ సినీ ప్రేక్షకుల అంచనాలను దాటిపోయింది. జస్ట్ సింప్లీ సూపర్బ్.

హీరో విక్రమ్, ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అర్ధం అవుతుంది. పలు విభిన్న గెటప్ లలో కనిపించి ఔరా అనిపించాడు. ఈ ట్రైలర్ లో విక్రమ్, అమీ జాక్సన్ ల మధ్య రొమాంటిక్ యాంగిల్ ను చూపించారు. గ్రాండ్ విజువల్స్, శంకర్ మేకింగ్ స్టైల్, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం ఇలా 2 నిముషాల ట్రైలర్ లో ప్రతి ఒక్కరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.

ట్రైలర్ చూసిన తర్వాత సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ట్రైలర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు