సింగర్ కావాలనుకుంటున్న ఇలియానా

సింగర్ కావాలనుకుంటున్న ఇలియానా

Published on Apr 23, 2014 8:30 AM IST

ileana (1)
‘దేవదాసు’ సినిమాతో తెలుగు వారికి పరిచయమై అందరినీ ఆకట్టుకొని వరుసగా హిట్స్ అందుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అనిపించుకున్న గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం తనకు కెరీర్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. ఇప్పటి వరకూ హీరోయిన్ గానే అందరినీ ఆకట్టుకున్న ఇలియానా అవకాశం వస్తే సింగర్ గా కూడా తన టాలెంట్ చూపించాలనుకుంటోంది.

ఇలియానా తన అమ్మగారి కోరికను బయటపెడుతూ ‘ చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అన్నా , పాటలు పాడటం అన్నా చాలా ఇష్టం. ఫ్యామిలీ ఫంక్షన్ ఏదన్నా జరుగుతోంది అంటే పాటలు పాడటానికి నేనే ముందు ఉండేదాన్ని. అది గుర్తించుకున్న మా అమ్మ ఏదన్నా సినిమాలో పాట పాడాలని ఆశపడుతోంది. అవకాశం వస్తే కచ్చితంగా పాట పాడి మా అమ్మ కోరిక తీరుస్తా’ అంటోంది.

ఇదివిన్న ఎవరన్నా ఇలియానాకి సింగర్ చాన్స్ ఇస్తారేమో చూద్దాం. ఇలియానా ప్రస్తుతం సైఫ్ ఆలీఖాన్ సరసన చేస్తున్న సినిమాలో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు