ఇంటర్వ్యూ : ఆది సాయికుమార్ – ఇకపై కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేయాలనుకుంటున్నాను !

ఇంటర్వ్యూ : ఆది సాయికుమార్ – ఇకపై కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేయాలనుకుంటున్నాను !

Published on Nov 1, 2017 1:31 PM IST

యంగ్ హీరో ఆది సాయికుమార్ చేసిన తాజా చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ ఈ శుక్రవారం 3వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో చిత్రం విశేషాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది ?
జ) ప్రభాకర్ గారు 20 నిముషాల పాటు స్టోరీ లైన్ చెప్పారు. అప్పుడే నాకు నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పాను.

ప్ర) గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం ఎలా ఉంది ?
జ) స్టోరీ లైన్ చెప్పి ఇది గీతా ఆర్ట్స్ నిర్మించనున్న సినిమా అని చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇంత పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేయడం ఒక గొప్ప అనుభవం.

ప్ర) ప్రభాకర్ గారి డైరెక్క్షన్ ఎలా ఉంది ?
జ) ఆయనకు ఇంతకూ ముందే అనుభవం ఉండటం వలన సులభంగానే అనిపించింది. కేవలం సింగిల్ షెడ్యూల్లో 37 రోజుల్లోనే షూట్ మొత్తం పూర్తిచేశారాయన.

ప్ర) మొదటి ప్రభాకర్ గారు డైరెక్ట్ చేయగలరనే నమ్మకం మీకుందా ?
జ) అవును. ఆయన కథ చెప్పిన విధానం చూడగానే సినిమా చేయగలరనే నమ్మకం ఏర్పడిపోయింది. ఎలాంటి టెంక్షన్ లేకుండా సినిమా తీసేశారు.

ప్ర) కొత్తగా హర్రర్ జానర్ సినిమాను ఎంచుకున్నారెందుకు ?
జ) అంటే పలానా జానర్ సినిమాలే చేయాలనే రూల్ పెట్టుకోలేదు నేను. మంచి నటుడు అనిపించుకోవాలనేది నా కోరిక. అందుకే మంచి కథలు ఎలాంటివైనా చేస్తాను.

ప్ర) ‘నెక్స్ట్ నువ్వే’ కు ఒప్పుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ?
జ) నాకు సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. హర్రర్ తో పాటు కామెడీ కూడా కలగలిసి ఉంటుంది. అదే నన్ను ఎక్కువగా ఎగ్జైట్ చేసిన అంశం.

ప్ర) ఈ చిత్రం రీమేక్ అని మీకు ముందే తెలుసా ?
జ) తెలుసు. దీని ఇరిజినల్ వెర్షన్ ‘యామిరుక్క భయమే’. అందులో నుండి కథను మాత్రమే తీసుకున్నారు. తెలుగులో 60 – 70 శాతం మార్పులు చేశారు. అంతేగాక అక్కడి హీరోని ఇమిటేట్ చేయలేదు. నా స్టైల్లో నేను చేశాను.

ప్ర) ఇకపై కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తారా ?
జ) తప్పకుండా. మంచి కథలు వస్తే ఖచ్చితంగా చేస్తాను.

ప్ర) ఇకపై మీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ?
జ) ఇక నుండి రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్తగా, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని చేయాలని అనుకుంటున్నాను. కొత్త దర్శకులతో పనిచేయాలని ఆశపడుతున్నాను.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) స్టూడియో గ్రీన్ తో మూడు సినిమాల్ని ఒప్పుకున్నాను. వాటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా ఇంకొకటి స్ట్రయిట్ తెలుగు సినిమా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు