ఠాగూర్ లాంటి చిత్రం తీయాలనివుంది: హరీష్ శంకర్

harish-shankar
దర్శకుడు హరీష్ శంకర్ సాయి ధరమ్ తేజ్ తో త్వరలో ఒక చిత్రం ప్రారంభించనున్నాడు. అందుకోసం తన సెంటిమెంట్ ప్రకారం చాగల్లులోని వినాయకుడి గుడిని దర్శించారు. ఆ పర్యటనలో భాగంగా విలేకరులతో మాట్లాడారు.

“కొత్త చిత్రం ప్రారంభించే ముందు ఈ గుడికి వచ్చి వినాయకుడిని ప్రార్ధించడం నాకు సెంటిమెంట్ గా మారింది. త్వరలో ప్రారంభించనున్న నా అయిదో చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. నాకు ఠాగూర్ లాంటి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం తీయాలనివుంది.” అని హరీష్ తెలిపారు.

కొన్ని సంవత్సరాల క్రితం ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన హరీష్ అలాంటి విజయాన్ని మళ్ళి సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

Like us on Facebook