‘జిల్’లో నన్ను చూసుకొని.. నేనే ఆశ్చర్యపోయా!

‘జిల్’లో నన్ను చూసుకొని.. నేనే ఆశ్చర్యపోయా!

Published on Apr 1, 2015 9:12 AM IST

Gopicahnd
గోపీచంద్ హీరోగా రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ సినిమాల బ్యానర్ యూవీ క్రియేషన్స్ రూపొందించిన చిత్రం ‘జిల్’. ఈ శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందనే వస్తోంది. బాక్సాఫీస్ పరంగానూ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

సినిమా విజయం పట్ల హీరో గోపీచంద్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “జిల్ సినిమా చూసిన తర్వాత అందులో నన్ను చూసుకొని నేనే ఆశ్చర్యపోయా. దర్శకుడు రాధాకృష్ణ సినిమాను అందంగా తెరకెక్కించాడు” అని తెలిపారు. గోపీచంద్ ఇంతవరకూ కనిపించనంత అందంగా, స్టైలిష్‌గా కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రాశిఖన్నా అందచందాలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు