పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేస్తానన్న పవన్!

pawan-kalyan
ఓ పక్క సినిమాల్లో పవర్ స్టార్‌గా వెలుగొందుతూనే మరోపక్క సమాజ సేవలోనూ భాగమవుతానని చెబుతూ, పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ఓ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు మొదలైన ఈ పార్టీ తరపున ఆయన పలు ప్రజా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ సాయంత్రం రాయలసీమ ప్రాంతంలోని అనంతపూర్‌లో పవన్ జనసేన తరపున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ తన స్టైల్లో ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన ఈ సభలో డిమాండ్ చేశారు. ఇక జనసేన తరపున సీమలోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ఎల్లప్పుడూ పోరాడతామని, తన జనసేన మొదటి ఆఫీస్ అనంతపూర్‌లోనే ప్రారంభిస్తానని పవన్ తెలిపారు. ఇక జనసేన ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిందని, వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలూ పూర్తి కాగానే పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నారు.

 

Like us on Facebook