నేను ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను – బ్రహ్మానందం

నేను ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను – బ్రహ్మానందం

Published on Apr 21, 2014 9:30 AM IST

Brahmanandam
లెజెండ్రీ కమెడియన్ కామెడీ కింగ్ బ్రహ్మానందం టాలీవుడ్ లో అరంగేట్రం చేసి 30 సంవత్సరాలైంది. ‘అహ నాపెళ్ళంట’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కమెడియన్ 1986 లో వచ్చిన ‘చంటబ్బాయ్’ సినిమా నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకూ బ్రహ్మానందం సుమారు 986 సినిమాల్లో నటించాడు.

ఇటీవలే బ్రహ్మి కీలక పాత్ర పోషించిన రేసు గుర్రం సినిమా విజయం సాదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా ఫస్ట్ బ్రేక్ చంటబ్బాయ్ తో వచ్చింది. అక్కడి నుంచి ఎన్ని ఎత్తు పల్లాలు ఉన్నా ఈ జర్నీ మాత్రం మరచిపోలేనిది. అలాగే నేను ఉన్నంతవరకూ నా అభిమానులను నవ్విస్తూనే ఉంటానని’ అన్నాడు.

అలాగే మాట్లాడుతూ ‘నా సినిమా సక్సెస్ ఎప్పుడు నాకంటే ఎక్కువగా డైరెక్టర్, నిర్మాతలకే చెందుతుంది. అలాగే లైట్ బాయ్స్, మేకప్ ఆర్టిస్ట్ ల నుంచి అందరూ నేను ఫ్లాప్ లేదా సక్సెస్ లో ఎప్పుడూ నాతో పాటు ఉన్న వీరందరికీ ఎప్పుడూ ఋణపడి ఉంటానని’ అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు