ఇంటర్వ్యూ: మహేష్ బాబు – ఇకపై అభిమానులు కోరుకునే సినిమాలే చేస్తాను !

ఇంటర్వ్యూ: మహేష్ బాబు – ఇకపై అభిమానులు కోరుకునే సినిమాలే చేస్తాను !

Published on Apr 18, 2018 5:13 PM IST

మహేష్ బాబు, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా మహేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం..

సినిమా విడుదల పట్ల ఏమైనా టెంక్షన్ ఫీలవుతున్నారా ?
నా కెరీర్లో విడుదలకు ముందు ఎక్కువ నమ్మకంతో, ఆనందంతో ఉన్న సినిమా ఇదే. సినిమా నేను అనుకున్నదానికంటే గొప్పగా వచ్చింది. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఆసక్తిగా ఉంది.

కథలో ముఖ్యమంత్రిగా నటించడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు ?
నటన పరంగా ఇప్పటికే ఇదే నాకు క్లిష్టమైన పాత్ర. పెద్ద డైలాగులు, పైగా పొలిటికల్ డైలాగ్స్ చెప్పడం కొద్దిగా కష్టంగా అనిపించింది. నా బావమరిది గల్లా జయదేవ పార్లమెంట్లో ఇచ్చిన కొన్ని స్పీచెస్ చూసి కొంత నేర్చుకున్నాను. మొత్తం మీద కొరటాల శివ సహకారంతో చేసేశాను.

ఈ సినిమా మీ కెరీర్లోనే స్పెషల్ అని ఎప్పుడు ఫీలయ్యారు ?
స్క్రిప్ట్ వినగానే ప్రత్యేకమైన సినిమా మీద పనిచేయబోతున్నానని అర్థమైపోయింది. కానీ ‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్ వినగానే సినిమా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందనే నమ్మకమొచ్చింది.

మీ సినిమా రాజకీయ నాయకుల నుండి ఎలాంటి రియాక్షన్స్ రాబడుతుందని అనుకుంటున్నారు ?
ఈ సినిమా ప్రతి నాయకుడ్ని మరింత భాద్యతగా మారేలా చేస్తుందని అనుకుంటున్నాను. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పొలిటికల్ పార్టీ సినిమాను బాగా మెచ్చుకుంటారు.

ఈ సినిమా మీ మీద ఎలాంటి ప్రభావం చూపింది ?
ఈ సినిమా ద్వారా రాజకీయాలు అంటే అనుకున్నంత సులువు కాదని తెలుసుకున్నాను. అలాగే సమాజం పట్ల మరింత భాద్యతగా ఉండటం నేర్చుకున్నాను.

సినిమా ఔట్ ఫుట్ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు ?
ఈసారి అన్నీ సరిగ్గా కుదిరి సినిమా చాలా బాగా వచ్చింది. స్క్రిప్ట్, సన్నివేశాలు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరి మీద చిత్రం తప్పకుండా ప్రభావాన్ని చూపుతుంది.

మీ చివరి రెండు సినిమాల పరాజయాల నుండి ఏం నేర్చుకున్నారు ?
ఆ సినిమాల్లోని నా పాత్రలతో ప్రయోగం చేశాను. ఇకపై కమర్షియల్ సినిమాలే చేస్తాను. నేరుగా చెప్తున్నాను… ఇకపై నా అభిమానులు నన్ను ఎలాంటి సినిమాల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలే చేస్తాను.

తారక్ ను ఆడియో వేడుకకు అతిధిగా పిలవాలనేది ఎవరి ఆలోచన ?
అది అందరిదీ. ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని టీమ్ సభ్యులం మొత్తం అనుకున్నాం. నేను, తారక్ కలిసినప్పుడు సినిమా విషయాలు తప్ప అన్నీ మాట్లాడుకుంటాం. ఇలాంటి పరిణామాలు పరిశ్రమలోని వాతావరణాన్ని తప్పకుండా మారుస్తాయి.

ఈ సినిమా తర్వాత రాజకీయాల్లో చేరాలని ఏమైనా అనిపించిందా ?
ముందే చెప్పాను.. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు. చివరికు వరకు సినిమాల్లోనే పనిచేస్తా. రాజకీయాలనేవి భిన్నమైనవి. ప్రజల కోసం పనిచేసే నాయకుల పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది.

మీ తర్వాతి సినిమాలేమిటి ?
వంశీ పైడిపల్లి సినిమా జూన్ మొదటి వారంలో మొదలవుతుంది. అది ఎక్కువ అమెరికాలోనే జరుగుతుంది. అది కాకుండా సుకుమార్, సందీప్ రెడ్డి లతో పనిచేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు