నేను మొక్కలతో మాట్లాడుతున్నాను – రకుల్ ప్రీత్ సింగ్

నేను మొక్కలతో మాట్లాడుతున్నాను – రకుల్ ప్రీత్ సింగ్

Published on Sep 22, 2014 3:38 PM IST

Rakul-Preet-Singh
యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ఈ సినిమాలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందని ఈ భామ చెప్తుంది.

‘పండగ చేస్కో’ సినిమాలో మొక్కలు (ప్లాంట్స్)కు లైఫ్ ఉందని భావించే పాత్రలో నేను కనిపిస్తాను. వాటితో మాట్లాడే క్యారెక్టర్ నాది. అవి నేను చెప్పే మాటలు వింటున్నాయని ఫీల్ అయ్యే పాత్ర చేశాను. నేను ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ లో నటించలేదు, ప్రేక్షకులు నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు. అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది, తమన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు