ఇంటర్వ్యూ : ప్రియాంక పల్లవి – సమంత లాంటి పాత్రలు చేయాలనుంది !

ఇంటర్వ్యూ : ప్రియాంక పల్లవి – సమంత లాంటి పాత్రలు చేయాలనుంది !

Published on Dec 28, 2016 5:17 PM IST

priyanka-pallavi
ఈ మధ్య కాలంలో మంచి కథతో వస్తున్న చిన్న సినిమాలు ప్రేక్షకాదరణ దక్కించుకుని మంచి విజయాల్ని సాధిస్తున్న నైపథ్యంలో వస్తున్నా మరొక చిన్న సినిమానే ఈ ‘నేనొస్తా’ చిత్రం. పరంధ్‌ కళ్యాణ్‌ దర్శకత్వం వహించిన సినిమాలో జ్ఞాన్‌, సూర్య శ్రీనివాస్‌, ప్రియాంక పల్లవి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 30న రిలీజ్ కానున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ ప్రియాంక పల్లవితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్ర) షాట్ ఫిలిమ్స్ చేసే మీకు ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది ?

జ) నేను సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి సత్యానంద్ గారి దగ్గర 3 నెలల కోర్స్ చేశాను. నా మొదటి సినిమా ‘క్రిమినల్ ప్రేమ కథ’. ఇందులో కీ రోల్ చేస్తున్న జ్ఞాన్ నాకు యూనివర్సిటీలో సీనియర్ అతని ద్వారా ఛాన్స్ దొరికింది.

ప్ర) హర్రర్ సినిమాల్లో హీరోయిన్ కి స్కోప్ తక్కువుంటుంది. మీరెలా ఒప్పుకున్నారు ?

జ) ఈ కథ అలా లేదు. కథలో నాకు స్కోప్ తక్కువుంటుందని అసలు అనిపించలేదు. కథ వింటుంటే చాలా బాగా అనిపించి చేసి తీరాలి అనుకుని ఓకే చెప్పాను.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?

జ) ఇందులో నా పాత్ర ఈరోజుల్లో ఉండే అమ్మాయిలాగే ఉంటుంది. ఇందులో నాకు, నా బాయ్ ఫ్రెండ్ కి చిన్న మనస్పర్ధ వలన బ్రేకప్ అవుతుంది. అక్కడి నుండి సినిమా మొదలవుతుంది.

ప్ర) సినిమా జర్నీయేలా అనిపించింది ?

జ) సినిమా ఇంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు. కానీ చాలా స్మూత్ గా సాగిపోయింది. డైరెక్టర్, క్రూ అందరూ చాలా సహనంగా ఉంటారు. ఈ బ్యానర్లో పని చేయడం ఒక ఫ్యామిలీతో చేసినట్టు అనిపించింది. మా ఫ్రీడమ్ మాకిచ్చారు.

ప్ర) డైరెక్టర్ తో పనిచేయడం ఎలా అనిపించింది ?

జ) డైరెక్టర్ పరంధ్‌ కళ్యాణ్‌ తో పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ప్రతి షాట్ చాలా క్లీన్ గా, ఆర్టిస్టిక్ గా తీశారు. మమ్మల్ని చాలా అందంగా చూపారు.

ప్ర) మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
జ) మాది హైదరాబాదే. మా నాన్నగారికి స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. నేను పక్కా హైదరాబాదీ గర్ల్.

ప్ర) తెలుగులో మీకు డ్రీమ్ రోల్ ఎమన్నా ఉందా ?

జ) నాకు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. వాళ్ళ నటన చూస్తూనే పెరిగా. హీరోయిన్లాలో సమంత అంటే ఇష్టం. అ..ఆ సినిమాలో సమంత పాత్రలాంటివి చేయాలనుంది.

ప్ర) తెలుగమ్మాయిలు సినిమాలోకి రావడం తక్కువ. మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది ?

జ) నాకు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఏం కావాలో అదే చేయమంటారు. అసంతృప్తితో ఉండలేం కదా. అందుకే సపోర్ట్ చేశారు. ఇక గ్లామర్ అనేది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది.

ప్ర) ఈ సినిమాకి ఫ్యామిలీ నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ?

జ) ముందుగా ఈ సినిమా పోస్టర్ చూసి చాలా బాగుందన్నారు. టీజర్ కి కూడా అదే రెస్పాన్స్. అసలు పోస్టర్ చూసి అది నేనేనా అనుకుని నమ్మలేకపోయా. నా ఫ్రెండ్స్ అందరు కూడా సినిమా పేరు అయితే నీదే మరి అందులో ఉన్నది కూడా నువ్వేనా అని ఆశ్చర్యపోయారు.

ప్ర) సినియా రిలీజ్ దగ్గరపడింది. ఎలా ఫీలవుతున్నారు ?
జ) నాకు వారం నుండి సరిగా నిద్ర పట్టడం లేదు. క్యాలెండర్ లో ఒక్కో రోజు గడుస్తుంటే టెంక్షన్ గా ఉంటుంది. ఇక సినిమా రేపే అంటే ఇంకా టెంక్షన్ గా ఉంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు