సెప్టెంబర్ 19న ‘ఐస్ క్రీం 2’ విడుదల.

సెప్టెంబర్ 19న ‘ఐస్ క్రీం 2’ విడుదల.

Published on Aug 22, 2014 12:50 PM IST

ice-cream-2

‘ఐస్ క్రీం’ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం 2’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త తరహా టెక్నాలజీని పరిచయం చేయడమే కాదు, పబ్లిసిటీని కూడా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు వర్మ. డిఫరెంట్ అలోచించి 20 ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. కేవలం వారం రోజులలో ‘ఐస్ క్రీం 2’ షూటింగ్ కంప్లీట్ చేసిన వర్మ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. సెప్టెంబర్ 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘ఐస్ క్రీం 2’ విడుదలకు ముందే ‘ఐస్ క్రీం 3’ షూటింగ్ ప్రారంభించనున్నట్టు ఫస్ట్ లుక్స్ లాంచ్ కార్యక్రమంలో వర్మ వెల్లడించారు. సెప్టెంబర్ 15 నుండి ‘ఐస్ క్రీం 3’ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వర్మ ఆవిష్కరించిన న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ‘ఐస్ క్రీం’ సిరీస్ లను తెరకెక్కించనున్నారు. కొత్త సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, వర్క్ చేస్తున్న టెక్నీషియన్లకు పారితోషకం ఇవ్వరు. సినిమా విడుదలయ్యకా లాభాలలో షేర్ ఇస్తారు.

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యారాయణ నిర్మిస్తున్న ‘ఐస్ క్రీం 2’ సినిమాలో జెడి చక్రవర్తి, నవీన, తనికెళ్ళ భరణి, నందు, జీవా, ధనరాజ్, శాలిని తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం అవుట్ డోర్ లో జరిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు