ఇంటర్వ్యూ : మేఘన లోకేష్ – ‘ఇది మా ప్రేమ కథ’ చాలా నేచ్యురల్ గా ఉంటుంది !

ఇంటర్వ్యూ : మేఘన లోకేష్ – ‘ఇది మా ప్రేమ కథ’ చాలా నేచ్యురల్ గా ఉంటుంది !

Published on Dec 5, 2017 4:41 PM IST

యాంకర్ రవి హీరోగా మారుతూ చేసిన చిత్రం ‘ఇది మా ప్రేమ కథ’. ఈ చిత్రంలో రవికి జోడిగా మేఘన లోకేష్ నటించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సందర్బంగా ఆమె మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ సినిమా గురించి చెప్పండి ?
జ) ఇది నా ఫస్ట్ సినిమా. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ప్లైన్ గా అనిపించింది. కానీ దర్శకుడు అయోధ్య కార్తీక్ నేను చేస్తేనే బాగుంటుందని అన్నారు. దాంతో కొత్తవారిని ఎంకరేజ్ చేయాలని చేశాను.

ప్ర) మరి ఔట్ ఫుట్ ఎలా వచ్చింది ?
జ) సినిమా చాలా బాగా వచ్చింది. అంత చిన్న బడ్జెట్లో చాలా చక్కగా చేశారు. సింపుల్ గా, నేచ్యురల్ గా ఉంటుంది. ఇదొక మ్యూజికల్ మూవీ.

ప్ర) అసలు సినిమా కథేమిటి ?
జ) ఇదొక లవ్ స్టోరీ. ప్రేమించుకోవడానికి ఏ టైం కరెక్ట్, ప్రేమించిన వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు అనే అంశాల్ని చూపిస్తాం.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) నా క్యేరక్టర్ పేరు సంధ్య. చాలా మైల్డ్ గా, నార్మల్ గా ఉంటుంది. పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ వాడలేదు. రవి, ఇంకా ఇతర ముఖ్య నటులు నాకు బాగా సపోర్ట్ చేశారు.

ప్ర) మీరు సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు. రెండిటిలో తేడా ఏంటి ?
జ) రెండిటినీ ఎంజాయ్ చేస్తున్నాను. వేటి కష్టాలు వాటికి, వేటి సుఖాలు వాటికి ఉంటాయి. కానీ నేను వచ్చింది సీరియల్స్ నుండే కాబట్టి ఎప్పటికీ వాటిని మర్చిపోను. హీరోయిన్ అయినా మంచి కథలు వస్తే తప్పకుండా భవిష్యత్తులో సీరియల్స్ చేస్తూనే ఉంటాను.

ప్ర) మీకు ఈ సినిమా అవకాశాం ఎలా వచ్చింది ?
జ) నేను ఇంతకు ముందు చేసిన ‘శశిరేఖా పరిణయం’ అనే సీరియల్ చూసి డైరెక్టర్ కార్తిక్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.

ప్ర) మీ మాతృ భాష కన్నడలో సినిమాలు చేయలేదా ?
జ) ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కానీ వాళ్ళు కంటిన్యూస్ గా మూడు నెలలు డేట్స్ అడిగారు. అప్పుడు సీరియల్స్ లో బిజీగా ఉండటం వలన అందుకే ఒప్పుకోలేదు. ఇప్పుడేమైనా ఛాన్సెస్ వస్తే తప్పకుండా చేస్తాను.

ప్ర) మీరు ఎలాంటి రోల్స్ అయితే చేస్తారు ?
జ) కథలో ఇంపార్టెన్స్ ఉండి, నటనకు స్కోప్ ఉండి, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర ఏదైనా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు