బాలీవుడ్ లో నటించేది లేదంటున్న నాని !

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని చేసిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొన్ని సినిమాలతో పాటు నిర్మాతగా కూడా బిజీగా ఉన్నారు నాని. అలాంటి ఆయనకు బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన ఉందా అంటే అలాంటి ఆలోచనే లేదని, ఎప్పటికీ తెలుగులోనే సినిమాలు చేస్తానని నాని అన్నారు.

దానికి గల కారణాన్ని కూడా బటయపెట్టారు నాని. ‘ఎస్వీ రంగారావు, ప్రకాష్ రాజ్ లాంటి నటులంతా ఇతర భాషల్లో కూడా బాగా పట్టున్నవారు కాబట్టి వాళ్ళు చేస్తే చూశారు. కానీ నాకు బాగా వచ్చింది తెలుగు మాత్రమే. తెలుగులో ప్రతి మాటను ఓన్ చేసుకుని చెప్పగలను. ఇతర భాషల్లో అలా చేయలేను. వేరే భాషల్లో నటిస్తే ఇతను మీదగ్గర మంచి హీరోనా అని నవ్వుతారు’ అంటూ చమత్కరించారు.

 

Like us on Facebook